Joe Biden calls 'emergency' meeting with Global Leaders over missile hits Poland
Sakshi News home page

పోలాండ్‌లో మిస్సైల్‌ అటాక్‌.. ఎమర్జెన్సీ మీటింగ్‌కు బైడెన్‌ పిలుపు!

Published Wed, Nov 16 2022 10:32 AM | Last Updated on Wed, Nov 16 2022 11:22 AM

Joe Biden Calls Emergency Meet With Global Leaders Attacks In Poland - Sakshi

ఉక్రెయిన్‌లో దాడులతో ప్రపంచదేశాలను రష్యా ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్‌ సరిహద్దు దేశం పోలాండ్‌ సరిహద్దులోకి ఓ మిస్సైల్‌ను ప్రయోగం జరగడం కలకలం సృష్టించింది. కాగా, ఈ మిస్సైల్‌ రష్యాకు చెందినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ దాడిలో ఇద్దరు మరణించారు.

మరోవైపు.. ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్న సమయంలో పోలాండ్‌లో ఇలా జరగడం మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. కాగా, ఈ మిస్సైల్‌ దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బో బైడెన్‌ అప్రమత్తమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బైడెన్‌.. జీ-7, నాటో దేశాల నేతలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా, జీ-20 సమావేశాల అనంతరం ఈ వీరితో బైడెన్‌ భేటీ కానున్నారు. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. నాటోలో పోలాండ్‌ సభ్య దేశంగా ఉంది.

ఇక.. పోలాండ్‌లో మిస్సైల్‌ దాడిని నాటో సభ్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మిస్సైల్‌ దాడికి రష్యానే పాల్పడిందని ఆరోపిస్తూ పుతిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఇక, ఈ మిస్సైల్‌ దాడి చేసింది.. రష్యా అనేందుకు ఆధారాలు లేవని, అయినప్పటికీ వివరణ కోరుతూ మాస్కో రాయబారికి సమన్లు జారీ చేసినట్లు పోలాండ్‌ ప్రకటించింది. మరోవైపు ఇదే విషయాన్ని పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement