వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తాను భేటీ అవ్వవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్వయంగా చెప్పారు. జీ–7 కూటమిలోకి రష్యాను మళ్లీ చేర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ వేసవికాలంలో పుతిన్‌ను కలుస్తారా అని విలేకరులు ప్రశ్నించగా ‘మేం కలవవచ్చు. అవును అది సాధ్యమే’ అని ట్రంప్ వెల్లడించారు. ‘ఉత్తర కొరియాలాగే ఎవరితోనైనా మనం కలిస్తే ఎంతో బాగుంటుంది’ అని ట్రంప్ అన్నారు.
ఉ.కొరియా సమస్యను పరిష్కరించా
ఉత్తరకొరియా అణు సమస్యను చాలా వరకు తాను పరిష్కరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ చెప్పారు. దీంతోపాటు దక్షిణకొరియాతో యుద్ధ విన్యాసాలను నిలిపివేయటం ద్వారా ఎంతో డబ్బును కూడా ఆదా చేయగలిగినట్లు తెలిపారు. కిమ్‌తో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు.
పుతిన్‌తో భేటీ సాధ్యమే
Published Sat, Jun 16 2018 3:46 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment