రష్యా సేనలు ఉక్రెయిన్ సరిహద్దు దాటితే రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాల్సి వస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ హెచ్చరించారు. ఆస్ట్రేలియా సహా పలు పాశ్చాత్య దేశాల నుంచి ఆహార ఉత్పత్తుల దిగుమతులపై రష్యా నిషేధం విధించిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. తమ సేనలు ఉక్రెయిన్ సరిహద్దులను దాటి వెళ్లేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుమతి మంజూరుచేస్తే, ఆస్ట్రేలియా నుంచి మరిన్ని కఠినమైన ఆంక్షలు ఎదుర్కోక తప్పదని అబాట్ అన్నారు.
ఈ ఆంక్షలు ఎదురుకాకుండా ఉండాలంటే మాత్రం, సేనలను ముందుకు నడిపించడాన్ని రష్యా మానుకోవాలని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా, ఈయూ, అమెరికా, కెనడాల నుంచి వచ్చే వ్యవసాయోత్పత్తులు, ఇతర ఆహార పదార్థాల దిగుమతులపై రష్యా ఏడాది పాటు నిషేధం విధించడంతో ఈ దేశాల్లో రైతులు ఇబ్బందులు పడతారని చెప్పారు. ఉక్రెయిన్లో వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వడాన్ని మానుకోకపోతే మాత్రం రష్యాపై ఆంక్షలు ఎక్కువయ్యే తీరతాయని అబాట్ చెప్పారు.
గీత దాటారో.. జాగ్రత్త!!
Published Fri, Aug 8 2014 4:00 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement