వాషింగ్టన్: అమెరికాలోని భారతీయ హెచ్1 బీ వీసాదారులకు యూఎస్ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్స్.. ఈ కేసును తిరిగి కింది కోర్టుకు పునఃపరిశీలనకు పంపించింది. దిగువ న్యాయస్థానం ఈ ఆదేశాల్ని క్షుణ్నంగా పరిశీలించి ఓ నిర్ణ యానికి రావాలని సూచించింది. 2015లో ఒబామా ప్రభుత్వం హెచ్1 బీ వీసా దారుల జీవిత భాగస్వాములకు పని అను మతులు కల్పించాలని నిర్ణయిస్తూ హెచ్–4 వీసా విధానాన్ని తీసుకొచ్చింది. హెచ్–4 వీసా విధానం వల్ల అధిక ప్రయోజనం పొందుతున్నది భారతీయులు.. అందు లోనూ ప్రత్యేకంగా మహిళలే ఎక్కువగా ఉన్నారు. అయితే దీనివల్ల అమెరికన్లు ఎక్కువ సంఖ్యలో నష్టపోతున్నారని భావించిన ట్రంప్ ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment