గుజరాత్: స్వదేశాన్ని విదేశాల్లో విమర్శించడం ఏ పార్టీ నాయకుడికైనా తగనిపని అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత్‌ను కించపరచడానికే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ తన పూర్వీకుల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని సూచించారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
'దేశంపై భక్తి ఉన్న ఏ వ్యక్తి అయినా దేశ రాజకీయాలను దేశంలోపలే మాట్లాడుతారు. విదేశాలకు వెళ్లి దేశ రాజకీయాల గురించి ఏ పార్టీ నాయకుడు మాట్లాడరు.దేశాన్ని విదేశాల్లో విమర్శించడం సరైన పని కాదు.ప్రజలు దీన్ని గమనిస్తున్నారు' అని ప్రధాని మోదీ పాలన 9 ఏళ్లు గడిచిన సందర్భంగా గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
దేశ వ్యతిరేక చర్యల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా ఉండలేదు. ఎండాకాలం వేడి నుంచి తప్పించుకోవడానికి రాహుల్ విదేశాలకు వెళ్లారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:దేశంలో తొలిసారి.. ముంబై అరుదైన ఘనత.. రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు
Comments
Please login to add a commentAdd a comment