కొందరు అత్యంత విభిన్నమైన ఆలోచనతో మొదలుపెట్టే.. బిజినెస్ ఊహించని రీతీలో ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తుంది. తాము ఫేస్ చేసిన సమస్య నుంచి బయటపడి..వ్యాపారానికి దారితీయడం అనేది అత్యంత అరుదు. అచ్చం ఇలానే ఓ జంట వ్యాపారం చేసి కోట్లు గడించింది. పైగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేసేలా చేసే వ్యాపారంతో దూసుకుపోయింది. ఆరోగ్యం తోపాటు ఆదాయాన్ని అందించే గొప్ప వ్యాపారంగా తీర్చిదిద్దింది. ఇంతకీ ఏంటా వ్యాపారం అంటే.
అమెరికాకు చెందిన జ్యూడి ఎడ్వర్ట్ అనే మహిళ క్రానిక్ కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్‌తో బాధపడేది. దీంతో ఆమెకు డాక్టర్లు వాష్‌రూమ్‌లో ఇండియన్ స్టైల్ పొజిషన్‌లో కూర్చొమని సలహా ఇచ్చారు. జూడి తన భర్త, కొడుకు సాయంతో వెస్టర్న్ కమోడ్‌పై స్క్వాటీ పొజిషన్(భారత టాయిలెట్ స్టైల్)లో కూర్చొనేలా స్క్వాటీ పాటీని క్రియేట్ చేసుకుంది. దీని సాయంతో కూర్చోవడం వల్ల ఆమెకు కొద్ది రోజుల్లో ఆ సమస్య తగ్గిపోయింది.
అయితే ఈ క్రమంలో జూడీ తనలాంటి సమస్యనే చాలామంది ఎదుర్కొంటున్నారని తెలుసుకుని దీన్ని బిజినెస్‌గా ఎందుకు చేయకూడదు అనుకుంది. ఆ నేపథ్యంలోనే జూడీ దంపతులు స్క్వాటీ పాటీ వుడ్ టూల్ బిజినెస్‌ని ప్రారంభించారు. ఇలా ప్రారంభించారో లేదో జస్ట్ ఫస్ట్ ఇయర్‌లోనే వన్ మిలియన్ డాలర్ల సేల్స్‌ని కంప్లీట్ చేశారు. చెప్పేందుకు కూడా ఇబ్బందికరమైన ఈ వ్యాపారాన్ని తనలాంటి సమస్యతో ఎవ్వరూ విలవిల లాడకూడదనుకుంది. ఆ ఆలోచనతోనే దీన్ని ప్రారంభించి మంచి లాభాలను గడించింది.
అదీగాక ప్రస్తుతం ఏకంగా రూ. 1400 కోట్ల టర్నోవర్‌తో లాభదాయకంగా సాగిపోతోంది. నిజానికి మన పూర్వకులు ముందుచూపుతో ఎనిమిదివేల సంవత్సరాల క్రితమే మలబద్ధ సమస్యలు దరిచేరకుండా హ్యమన్ బాడీ పోస్చర్‌కి అనుగుణంగా ఈ ట్రెడిషనల్ టాయిలెట్స్‌ని డిజైన్ చేశారు. అయితే మనం పూర్వీకులు చెప్పే ప్రతిదాని వెనుక ఏదో మర్మం ఉంటుందనేది గ్రహించం.
పైగా వాళ్లు ఆరోగ సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చి..ఎలాంటి ఆరోగ్య సమస్యల బారినపడకుండా జీవించేలా చేస్తున్నారని అస్సలు గుర్తించం. అదీగాక నేటి యువతరం టెక్నాలజీ పేరుతో వాటిని పక్కన పెట్టేసి కోరి కష్టాలు కొని తెచ్చుకుని, అనారోగ్యం పాలవ్వుతుండటం బాధకరం.
(చదవండి: మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్! అక్కడంతా శాకాహారులే..!)
Comments
Please login to add a commentAdd a comment