indian toilet
-
ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్ బిజినెస్‌తో ఏకంగా రూ. 1500 కోట్లు..!
కొందరు అత్యంత విభిన్నమైన ఆలోచనతో మొదలుపెట్టే.. బిజినెస్ ఊహించని రీతీలో ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తుంది. తాము ఫేస్ చేసిన సమస్య నుంచి బయటపడి..వ్యాపారానికి దారితీయడం అనేది అత్యంత అరుదు. అచ్చం ఇలానే ఓ జంట వ్యాపారం చేసి కోట్లు గడించింది. పైగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేసేలా చేసే వ్యాపారంతో దూసుకుపోయింది. ఆరోగ్యం తోపాటు ఆదాయాన్ని అందించే గొప్ప వ్యాపారంగా తీర్చిదిద్దింది. ఇంతకీ ఏంటా వ్యాపారం అంటే.అమెరికాకు చెందిన జ్యూడి ఎడ్వర్ట్ అనే మహిళ క్రానిక్ కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్తో బాధపడేది. దీంతో ఆమెకు డాక్టర్లు వాష్‌రూమ్‌లో ఇండియన్ స్టైల్ పొజిషన్లో కూర్చొమని సలహా ఇచ్చారు. జూడి తన భర్త, కొడుకు సాయంతో వెస్టర్న్ కమోడ్‌పై స్క్వాటీ పొజిషన్(భారత టాయిలెట్ స్టైల్)లో కూర్చొనేలా స్క్వాటీ పాటీని క్రియేట్ చేసుకుంది. దీని సాయంతో కూర్చోవడం వల్ల ఆమెకు కొద్ది రోజుల్లో ఆ సమస్య తగ్గిపోయింది. అయితే ఈ క్రమంలో జూడీ తనలాంటి సమస్యనే చాలామంది ఎదుర్కొంటున్నారని తెలుసుకుని దీన్ని బిజినెస్‌గా ఎందుకు చేయకూడదు అనుకుంది. ఆ నేపథ్యంలోనే జూడీ దంపతులు స్క్వాటీ పాటీ వుడ్ టూల్ బిజినెస్‌ని ప్రారంభించారు. ఇలా ప్రారంభించారో లేదో జస్ట్ ఫస్ట్ ఇయర్లోనే వన్ మిలియన్ డాలర్ల సేల్స్‌ని కంప్లీట్ చేశారు. చెప్పేందుకు కూడా ఇబ్బందికరమైన ఈ వ్యాపారాన్ని తనలాంటి సమస్యతో ఎవ్వరూ విలవిల లాడకూడదనుకుంది. ఆ ఆలోచనతోనే దీన్ని ప్రారంభించి మంచి లాభాలను గడించింది. అదీగాక ప్రస్తుతం ఏకంగా రూ. 1400 కోట్ల టర్నోవర్‌తో లాభదాయకంగా సాగిపోతోంది. నిజానికి మన పూర్వకులు ముందుచూపుతో ఎనిమిదివేల సంవత్సరాల క్రితమే మలబద్ధ సమస్యలు దరిచేరకుండా హ్యమన్ బాడీ పోస్చర్కి అనుగుణంగా ఈ ట్రెడిషనల్ టాయిలెట్స్‌ని డిజైన్ చేశారు. అయితే మనం పూర్వీకులు చెప్పే ప్రతిదాని వెనుక ఏదో మర్మం ఉంటుందనేది గ్రహించం.పైగా వాళ్లు ఆరోగ సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చి..ఎలాంటి ఆరోగ్య సమస్యల బారినపడకుండా జీవించేలా చేస్తున్నారని అస్సలు గుర్తించం. అదీగాక నేటి యువతరం టెక్నాలజీ పేరుతో వాటిని పక్కన పెట్టేసి కోరి కష్టాలు కొని తెచ్చుకుని, అనారోగ్యం పాలవ్వుతుండటం బాధకరం.(చదవండి: మాంసం ముట్టని వెజిటేరియన్ విలేజ్! అక్కడంతా శాకాహారులే..!) -
శభాష్ ఉపాసనా..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు, నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన కామినేని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. ఇండియన్ టాయిలెట్ సిస్టంలో పలు లోపాలు ఉన్నాయని, ఇవి మోకాళ్ల నొప్పులకు కారణమవుతున్నాయని ప్రచారం జరుగుతున్నా.. అసలు ఈ విధానంతో ఆరోగ్యానికి మేలు చేసే పలు కారణాలు ఉన్నాయని ఆమె చెబుతున్నారు. చెప్పడమేకాదు.. ఇండియన్ టాయిలెట్ స్టైల్ మేలంటూ పలు చిత్రాలు కూడా పోస్టు చేయడం గమనార్హం. ఈ భంగిమ శరీరానికి చక్కటి వ్యాయామమని వెల్లడించారు. రోజూ ఐదు నిమిషాలు ఇలా కూర్చోవడం వల్ల కాళ్ల ఎముకలు గట్టిపడతాయని, శరీరంలోని చిన్నపేగు, పెద్ద పేగు కదలికలు కూడా సులువుగా మారతాయని చెబుతున్నారు. ‘ఇలా కూర్చున్నప్పుడు మన మోకాలు 90 డిగ్రీల వరకు వంగుతుంది. శరీరంలోని మృదులాస్థి కదలికలకు సైనోవియల్ ఫ్లూయిడ్ కీలకం. మనం ప్రతిరోజూ కూర్చోవడం వల్ల ఈ ఫ్లూయిడ్ పూర్తిగా విస్తరిస్తుంది. ఫలితంగా కీళ్లు త్వరగా అరిగిపోకుండా దోహదపడుతుంది’అని వివరించారు. శభాష్ ఉపాసనా.. భారతీయ టాయిలెట్ విధానాన్ని ప్రమోట్ చేస్తూ.. అందులో ఉన్న ఆరోగ్య రహస్యాలను వివరించేందుకు ముందుకు వచ్చిన ఉపాసనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ట్వీట్ చేసిన 24 గంటల్లోనే నెటిజన్లు 900 వరకు రీట్వీట్ చేశారు. 8 వేల వరకు లైకులు పడగా.. 300 వరకు కామెంట్లతో ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. -
'టాయిలెట్ విధానం వల్లే కీళ్ల అరుగుదల'
హైదరాబాద్: కాల్షియం లోపంతో పాటు ఇండియన్ టాయిలెట్ విధానంలో తరచూ కింద కూర్చొని లేవడం వల్ల అనేక మందిలో చిన్న వయసులోనే మోకాలి కీళ్లు అరుగుతున్నాయని ప్రముఖ మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ అఖిల్‌దాడీ చెప్పారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉందని స్పష్టం చేశారు. ఆదివారం హోటల్ మ్యారీగోల్డ్‌లో జరిగిన 'శ్రీకర' ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన ఫోర్త్ జాయింట్ రీప్లేస్మెంట్ లైవ్ సర్జరీ వర్క్‌షాప్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది ఆర్థోపెడిక్ నిపుణులు హాజరయ్యారు. దీనికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు తుంటి, ఒక పాడైపోయిన జాయింట్‌తో పాటు మరో నాలుగు మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి లైవ్ ద్వారా వర్క్‌షాప్‌కు హాజరైన వారికి చూపించారు. అనంతరం డాక్టర్ అఖిల్ దాడీ మాట్లాడుతూ... సంప్రదాయం పేరుతో ఇప్పటికీ చాలా మంది మహిళలు నేలపై కూర్చుంటున్నారని, ఇలా కూర్చొని లేవడం వల్ల మోకాళ్లు అరుగుతున్నాయని చెప్పారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి శస్త్రచికిత్స అవసరం లేదన్నారు. లక్ష మంది బాధితుల్లో కేవలం రెండు వేల మందికి మాత్రమే మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఉంటుందన్నారు. మిగిలిన వారికి మందులతోనే నయం అవుతుందని చెప్పారు.