‘టీచింగ్ ఎక్సలెన్స్’ దరఖాస్తుల గడువు పెంపు | Applications date extends for Teaching excellence | Sakshi
Sakshi News home page

‘టీచింగ్ ఎక్సలెన్స్’ దరఖాస్తుల గడువు పెంపు

Published Thu, Apr 2 2015 2:11 AM | Last Updated on Sat, Aug 25 2018 3:20 PM

అమెరికా-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో ఆరువారాల పాటు నిర్వహించనున్న టీచింగ్ ఎక్సలెన్స్ అచీవ్‌మెంట్..

సాక్షి, హైదరాబాద్: అమెరికా-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాలో ఆరువారాల పాటు నిర్వహించనున్న టీచింగ్ ఎక్సలెన్స్ అచీవ్‌మెంట్ కార్యక్రమానికి దరఖాస్తుల గడువును ఈనెల 15 వరకు పొడిగించిన ట్లు అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ, ఏపీ, ఒడిశాల్లో 6 నుంచి 12వ తరగతి వారికి ఇంగ్లిష్, సోషల్, మ్యాథ్స్, సైన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.

పాఠ్య ప్రణాళికల తయారీ, బోధన పద్ధతుల్లో ఆధునిక విధానాలపై ఈ కార్యక్రమం ఉంటుందని, అమెరికాలోని తరగతి గదుల్లో బోధన విధానాలు, అక్కడి విద్యా కార్యక్రమాలపై పరిశీలన ఉంటుందని వెల్లడించింది. ఇందులో పాల్గొనే వారికి రవాణా ఛార్జీల చెల్లింపు, ఇతర ఖర్చులు ఇస్తారని, పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్ (http://www.usief.org.in)లో పొందవచ్చని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement