వాషింగ్టన్: ఇండియాకు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ)ని తొలగించే విషయంలో మరో ఆలోచన లేదనీ, ఇది ఇప్పటికే ముగిసిన అంశమని అమెరికా సీనియర్ అధికారి ఒకరు గురువారం చెప్పారు. అలాగే డేటాను భారత్ లోనే భద్రపరచాలన్న నిబంధన, ఇండియాలోని మార్కెట్‌కు అమెరికా కంపెనీలకు యాక్సెస్ కల్పించడం తదితర అంశాల్లో తమ అభ్యంతరాలకు భారత్ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు.
జీఎస్పీ హోదా ఉన్న దేశాల నుంచి వచ్చే దాదాపు 2 వేల వేర్వేరు వస్తువులపై పన్ను విధించకుండానే అమెరికాలోకి దిగుమతి చేసుకుని, ఎగుమతి చేస్తున్న దేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం కోసం ఈ జీఎస్పీ విధానాన్ని అమెరికా గతంలో తీసుకొచ్చింది. అయితే ఈ ఏడాది మార్చి 4న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ, భారత్‌కు జీఎస్పీ హోదాను రద్దు చేసేందుకు తాము మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు. 60 రోజుల నోటీస్ కాలం మే 3న ముగిసింది. దీంతో భారత్‌కు జీఎస్పీ హోదాను రద్దుచేస్తున్నట్లుగా ఇక ఏ క్షణమైనా అధికారిక నోటిఫికేషన్‌ను అమెరికా విడుదల చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment