వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రయాత్మక మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని అటునుంచి అటే ఈజిప్టు పర్యటనకు పయనమయ్యారు. 1997 తర్వాత ఈజిప్టులో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. భారత ప్రధాని అమెరికా బయలుదేరే ముందే ఈజిప్ట్ పర్యటననుద్దేశించి మాకు అత్యంత సన్నిహితమైన దేశం ఈజిప్టు సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈజిప్టులో మొదటిసారి..
భారత్ నుంచి బయలుదేరే ముందే ప్రధాని మాట్లాడుతూ.. మాకు అత్యంత సన్నిహితమైన మిత్ర దేశం ఈజిప్టులో మొట్టమొదటిసారి పర్యటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జనవరిలో ఈజిప్టు అధ్యక్షుడు సిసికి మా దేశంలో ఆతిధ్యమివ్వడం మా భాగ్యం. భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసిన నెలల వ్యవధిలోనే నేను ఈజిప్టులో పర్యటింస్తుండడం బలపడుతున్న ఈ రెండు దేశాల స్నేహబంధానికి ప్రతీకని ఆయన వర్ణించారు. ఈజిప్టు ప్రెసిడెంట్ భారత దేశానికి వచ్చినప్పుడే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి బీజం పడిందన్నారు.
పర్యటనలో..
జూన్ 24 నుంచి ప్రారంభమవనున్న ప్రధాని ఈజిప్టు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు సిసితో రెండు దేశాల మధ్య బహుళ భాగస్వామ్యాల గురించి, ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఆచరించాల్సిన ప్రణాళికల గురించి చర్చించనున్నారు. తర్వాత ఆ దేశ ప్రభుత్వ పెద్దలతోనూ, అక్కడి ప్రముఖులతోనూ, ప్రవాస భారత సంఘాలతోనూ సమావేశం కానున్నారు. అనంతరం కైరోలోని హీలియోపోలీస్ కామన్వెల్త్ యుద్ధ స్మశానవాటికను సందర్శించి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు-పాలస్తీనా తరపున వీరోచితంగా పోరాడి అసువులుబాసిన సుమారు 4000 మంది భారతీయ సైనికులకు నివాళులర్పిస్తారు. పర్యటనలో భాగంగా చారిత్రాత్మక అల్-హకీమ్ మసీదును కూడా సందర్శించనున్నారు భారత ప్రధాని.
#WATCH | After concluding his maiden State Visit to the United States, Prime Minister Narendra Modi departs for Cairo, Egypt. pic.twitter.com/7JoFaoELke
— ANI (@ANI) June 24, 2023
ఇది కూడా చదవండి: భారత ప్రధానికి అమెరికా అధ్యక్షుడి అపురూప కానుక
Comments
Please login to add a commentAdd a comment