వాషింగ్టన్/న్యూఢిల్లీ: ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌పై యుద్ధం చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని అమెరికా, భారత్ నిర్ణయించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య శనివారం జరిగిన ఫోన్ సంభాషణలో పలు అంశాలపై చర్చించుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న ఈ సమయంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగ, ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యతపైన కూడా ఇద్దరు నేతలు చర్చించారు. కోవిడ్–19 రోగులకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల్ని పంపించాలని ట్రంప్ కోరారు.
మలేరియా వ్యాధిని అరికట్టే క్లోరోక్విన్ టాబ్లెట్లు కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తూ ఉండడంతో అమెరికా కొన్నాళ్ల క్రితమే భారత్‌కి ఆర్డర్ పెట్టుకుంది. భారత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువ కావడంతో క్లోరోక్విన్ ఎగుమతుల్ని ఈ నెల 4న భారత్ నిషేధించింది. దీంతో ట్రంప్ ఫోన్ చేసి మోదీతో మాట్లాడారు. తమ కంపెనీలు ఆర్డర్ చేసిన క్లోరోక్విన్ మాత్రల్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్రంప్ విలేకరులతో.. ‘భారత ప్రధానితో మాట్లాడాను. భారత్ క్లోరోక్విన్ మాత్రలను భారీ స్థాయిలో తయారు చేస్తోంది. నా విజ్ఞప్తిపై భారత్ సీరియస్‌గానే ఆలోచిస్తోంది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment