జనరల్ మోటార్స్ 1996లో మొదటి ఆధునిక ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేసినప్పటి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచ మార్కెట్ క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2008లో టెస్లా కంపెనీ లాంచ్ చేసిన తన ఎలక్ట్రిక్ కారు తర్వాత ఆ రంగం శర వేగంగా విస్తరించడం మొదలు పెట్టింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొంటూ కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల కోసం గూగుల్‌లో ఎక్కువ వెతికిన వాటిలో టెస్లా కారు అగ్రస్థానంలో నిలిచింది.
ఈ కంపెనీకి చెందిన నాలుగు మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సర్చ్ చేసిన మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి. partcatalog.com విడుదల చేసిన డేటా ప్రకారం.. టెస్లా మోడల్ 3 కారును ప్రపంచంలో అత్యధికంగా వెతికారు. ఈ కారు కోసం నెలకు 2,240,000 మంది సర్చ్ చేశారు. టెస్లా మోడల్ ఎస్, మోడల్ వై & మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కార్లు ఆ తర్వాత స్థానాలలో ఉన్నాయి. టెస్లా కాకుండా ఆ తర్వాత స్థానాలలో ఆడి ఇ-ట్రాన్ (2021 నుంచి నెలకు ఒక మిలియన్ సార్లు), పోర్స్చే టేకాన్ (నెలకు మిలియన్ సార్లు కూడా), తర్వాత వోక్స్ వ్యాగన్ ఐడి.4(823,700) కార్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్ పరంగా కూడా టెస్లా (11,100,000)ను ఎక్కువ మంది సర్చ్ చేశారు.
(చదవండి: e-nomination: చందాదారులకు చుక్కలు చూపిస్తున్న ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్..!)
Comments
Please login to add a commentAdd a comment