ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరే చెప్పుకోక ఉండలేదు. టెస్లా కార్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాతనే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది టెస్లా. అలాంటి కంపెనీ నుంచి ఒక కారు వస్తుంది అంటే? దానికి ఉండే క్రేజ్ వేరు. టెస్లా గతంలో సైబర్ ట్రక్ పేరుతో ఒక కారును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఈ కారుని మార్కెట్లోకి తీసుకొని రాలేదు. అయితే, అచ్చం అలాంటి ఒక కారును చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ స్టార్టప్ ఎడిసన్ ఫ్యూచర్ కంపెనీ ఈఎఫ్1-టీ పేరుతో రూపొందించింది.
అచ్చం టెస్లా సైబర్ ట్రక్ లాగా
ఈ ఎడిసన్ ఫ్యూచర్ స్టార్టప్ కంపెనీ ఈఎఫ్1-టీ సోలార్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ కాన్సెప్ట్ ను నవంబర్ 19 నుంచి జరుగుతున్న లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఈ వారం ప్రదర్శించింది. ఇది అచ్చం చూడాటానికి టెస్లా సైబర్ ట్రక్ లాగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సోలార్ ట్రక్కును ఈఎఫ్1-టీ పేరుతో పిలుస్తారు. ఇది రిట్రాక్టబుల్ సోలార్ కవర్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ట్రక్ పగటిపూట ప్రయాణిస్తున్నపుడు దానికి అదే ఛార్జ్ అవుతుంది. సోలార్ రూఫ్ రోజుకు 25 నుంచి 35 మైళ్ల రేంజ్ అందించగలదని కంపెనీ చెబుతోంది. ఈ ట్రక్ వెనుక భాగాన్ని మూసినప్పుడు ఈఎఫ్1-టీ పికప్ ట్రక్కు టెస్లా సైబర్ ట్రక్ లాగా కనిపిస్తుంది. ఈఎఫ్1-టీ రిట్రాక్టబుల్ సోలార్ ప్యానెల్స్ పొరల రూపాన్ని కలిగి ఉంటుంది.
724 కిమీ రేంజ్
టెస్లా సైబర్ ట్రక్ లాగా ఈ ట్రక్ గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ అవునా? కాదా అనేది తెలీదు. ఈఎఫ్1-టీ ఎలక్ట్రిక్ సోలార్ పికప్ ట్రక్కు లోపల17.5 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, మిర్రర్ కెమెరా స్క్రీన్లు, డోర్ మౌంటెడ్ టూల్ బాక్స్, రూఫ్ మౌంటెడ్ రీడింగ్ లైట్లు ఉన్నాయి. ఈఎఫ్1-టి ధర ఎంత అనేది తెలీదు, కానీ కంపెనీ 2025లో ట్రక్కును ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది ఈఎఫ్1-టీ ట్రక్ మూడు వేరియంట్స్ లలో అందుబాటులో ఉండనుంది. దీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 724 కిమీలకు పైగా దూసుకెళ్లనుంది. ఇది 0-100 కిమీ వేగాన్ని 3.9 సెకన్లలలో అందుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment