జాతీయ,అంతర్జాతీయ సమస్యలు టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గ్లోబల్ సప్లయి చైన్‌తో పాటు ఇతర కారణాల వల్ల కార్ల ఉత్పత్తితో పాటు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. దీంతో లాభాలు రాకపోయినా ఫర్వాలేదు. సంస్థ నష్టపోకుండా ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా టెస్లా కార్ల ధరల్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మే, జూన్ నెలల్లో టెస్లా కార్లలో వినియోగించే అల్యూమినియంతో పాటు ఇతర ముడి సరుకు ధరలు పెరిగాయి. వాటి పెరుగుదల టెస్లా కార్ల ఉత్పత్తిపై పడింది. అందుకే జూన్ నెలలో టెస్లా పలు లాంగ్ రేంజ్ మోడల్ టెస్లా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు దారులకు చెప్పిన టైంకు డెలివరీ చేయడంలో విఫలమైంది.
ఈ నేపథ‍్యంలో పెరిగిపోతున్న ముడి సరకు ధరల్ని తట్టుకొని కార్లను ఉత్పత్తి చేసేందుకు మస్క్ టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ ధరల్ని 62,990 డాలర్ల నుంచి 65,990 డాలర్లకు పెంచారు. ఇదే విషయాన్ని టెస్లా తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అధికారికంగా ప్రకటించింది.
టెస్లాలో కాస్ట్ కటింగ్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోం నిర్వహిస్తున్నాయి. అందుకు భిన్నంగా మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నాయి. మస్క్ సైతం టెస్లా ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని పిలుపునిచ్చారు. వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని అన్నారు. అదే సమయంలో 10శాతం టెస్లా ఉద్యోగుల్ని తొలగిస్తూ మస్క్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చారు.
చదవండి👉 ఎలన్ మస్క్ ఆగమాగం, మంచు పర్వతంలా కరిగిపోతున్న ఆస్తులు!
Comments
Please login to add a commentAdd a comment