టెస్లా ఈ-కారు (ప్రతీకాత్మక చిత్రం)
వాహన రంగంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారిన అమెరికన్ కంపెనీ టెస్లా.. చీప్‌గా ఎలక్ట్రిక్ కారును వాహనదారులకు అందించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కిందటి ఏడాది టెస్లా బ్యాటరీ డే సందర్భంగా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ చేసిన ప్రకటనకు కొనసాగింపుగా.. తక్కువ ధరకే ఫుల్లీ ఆటానమస్ ఈ-కారును టెస్లా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఫుల్ సెల్ప్ డ్రైవింగ్ వ్యవస్థతో రూపొందించనున్న ఈ కారు ధర.. 25 వేల డాలర్లుగా(మన కరెన్సీలో 18 లక్షలుగా) ఫిక్స్ చేసినట్లు సమాచారం. స్టీరింగ్ వీల్ లేకుండానే రానున్న ఈ ఎలక్ట్రిక్ కారును.. మోడల్ 2గా(అఫీషియల్ పేరు కాదు) వ్యవహరించనున్నారు. ఈ చీప్ వెహికిల్‌ను 2023లో లాంఛ్ చేయనున్నారు. అయితే ఇది టెస్లా అధికారిక ప్రకటన కాకపోయినా.. మస్క్ తాజా ఇంటర్వ్యూ వ్యాఖ్యాలను ఉటంకిస్తూ ఎలక్ట్రిక్ అనే వెబ్‌సైట్ ఈ విషయాల్ని వెల్లడించింది. షాంఘై(చైనా)లోని గిగాఫ్యాక్టరీ నుంచి ఈ వాహనాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు ఆ కథనం పేర్కొంది.
భారత్ టార్గెట్‌గా..
ఒక్కసారిగా అంత ధర తగ్గించడం ఎలా సాధ్యమంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కొత్త బ్యాటరీ సెల్ యూనిట్ నెలకొల్పడం ద్వారా భారం తగ్గించుకోవచ్చంటూ మస్క్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాడు. ఈ మేరకు కొత్త కార్లపై 50 శాతం ధరల తగ్గింపు ఆలోచనకు టెస్లా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక టెస్లా కంపెనీ భారత్ లాంటి పెద్ద మార్కెట్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నాలుగు మోడల్స్‌కు సూత్రప్రాయంగా లైన్ క్లియర్ అయ్యిందంటూ కథనాలు వస్తున్నాయి. అయితే తక్కువ రేటు కార్ల తయారీ కూడా భారత్‌లాంటి దేశాలను దృష్టిలో పెట్టుకునే టెస్లా చేస్తోందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment