టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారతీయులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా టెస్లా కార్ల తయారీ సంస్థను ఏర్పాటు చేసేలా ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటామని తెలిపారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎలాన్ మస్క్‌ను న్యూయార్క్ టైమ్స్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ థోరాల్డ్ బార్కర్ భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. అందుకు మస్క్ ‘ఓ అబ్సల్యూట్లీ’ అంటూ సుమఖత వ్యక్తం చేశారు. దీంతో గత కొన్నేళ్లుగా భారత్‌లో టెస్లా కార్ల తయారీపై నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది.
భారత్‌లో టెస్లా ప్రతినిధుల పర్యటన
కొద్ది రోజుల క్రితం టెస్లా సీనియర్ ఉన్నతోద్యోగులు భారత్‌లో పర్యటించనున్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారని, ఈ సందర్భంగా టెస్లా కార్ల తయారీలో ఉపయోగించే విడిభాగాల గురించి చర్చిస్తారని బ్లూంబెర్గ్ నివేదించింది.
ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తుందా?
కాగా, భారత్‌లో పర్యటించే ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ విభాగంలో నిపుణులు(సీ- సూట్ ఎగ్జిక్యూటీవ్)లు, మేనేజర్లు ఉన్నారని బ్లూంబెర్గ్ పేర్కొంది. అయితే టెస్లా ప్రతినిధులు విదేశాల నుంచి భారత్‌కు దిగుమతయ్యే కార్లపై విధించే ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలని మోదీని కోరనున్నారని హైలెట్ చేసింది.
చదవండి👉రికార్డ్‌ల రారాజు.. ఎలాన్ మస్క్ ఖాతాలో ప్రపంచంలో అత్యంత అరుదైన చెత్త రికార్డ్
Comments
Please login to add a commentAdd a comment