Tesla founder Elon Musk
-
ఎలాన్ మస్క్ ఔదార్యం
టొరంటో: కెనడాలో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుకున్న భారత సంతతి వైద్యురాలికి సహాయం అందించేందుకు ఎక్స్(ట్విట్టర్) వ్యవస్థాపకుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు. ఆమె చెల్లించాల్సిన 3 లక్షల డాలర్లు(రూ.2.50 కోట్లు) జరిమానా చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ కెనడానలోని గ్రేటర్ టోరంటోలో గత పదేళ్లుగా చిన్నపిల్లల వైద్యురాలిగా పని చేస్తున్నారు. పిడియాట్రిక్స్, అలర్జీ, ఇమ్యూనాలజీలో పోస్ట్రుగాడ్యుయేట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. స్పెషలిస్టు డాక్టర్‌గా గుర్తింపు పొందారు. పేద ప్రజలకు, వలసదారులకు తన సేవలు అందిస్తుంటారు. 2020లో కెనడాలో కోవిడ్–19 మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్‌ను కుల్విందర్ కౌర్ గిల్ వ్యతిరేకించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనను కూడా తప్పుపట్టారు. లాక్డౌన్, వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ట్విట్టర్(ఇప్పుడు ఎక్స్) ధైర్యంగా పోస్టులు పెట్టారు. దీనిపై కెనడా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఆమెపై కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, సర్జన్స్ ఆఫ్ అంటారియో విచారణ ప్రారంభించింది. క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. దీనిపై కుల్విందర్ కౌర్ గిల్ న్యాయ పోరాటానికి దిగారు. కానీ, దురదృష్టం వెక్కిరించింది. 1.2 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని 2022 అక్టోబర్‌లో కోర్డు ఆమెను ఆదేశించింది. పలు విన్నపాల తర్వాత జరిమానాను 3 లక్షల డాలర్లుగా ఖరారు చేస్తూ గత నెలలో తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించడానికి గడువు కూడా ఎక్కువగా లేదు. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో కుల్విందర్ కౌర్ ప్రజల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. దాదాపు సగం నిధులు సేకరించింది. జరిమానా చెల్లించడానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంతలో ఈ విషయంలో తెలిసిన ఎలాన్ మస్క్ వెంటనే స్పందించారు. మొత్తం 3 లక్షల డాలర్ల జరిమానా తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఆయనకు కుల్విందర్ కౌర్ గిల్ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. కుల్విందర్ కౌర్ గిల్ ఎలాన్ మస్క్ -
టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?
టెస్లా తన కార్ల తయారీ పరిశ్రమను గుజరాత్లో స్థాపించే అవకాశం ఉన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. గుజరాత్లో జనవరి 2024లో జరిగే సమ్మిట్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెస్లా చాలా రోజులుగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి కేంద్రం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నందున ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం..గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సనంద్, ధోలేరా, బెచరాజీ ప్రదేశాల్లో ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేశీయ, అంతర్జాతీయ డిమాండ్లను తీర్చేందుకు టెస్లా గుజరాత్ ప్లాంట్‌ను వినియోగించనున్నట్లు తెలిసింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమక్షంలో గుజరాత్లో టెస్లా ప్లాంట్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని కథనాల ద్వారా తెలుస్తుంది. టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా గతంలో కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇదీ చదవండి: ‘ఎక్స్’లో కొత్త చాట్‌బాట్.. ప్రత్యేకతలివే.. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం గతంలో కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. -
టెస్లాకు త్వరలో లైన్ క్లియర్.. భారత్‌లోకి ప్రవేశం!
ఎలాన్‌మస్క్‌కు చెందిన టెస్లా కార్ల గురించి వినడం..సామాజిక మాధ్యమాల్లో చూడడం తప్పా నేరుగా భారత్‌లో ఉపయోగించింది లేదు. ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల టెస్లా కార్లకు అనుమతులు ఇవ్వలేదు. అయితే ఈసారి 2024 జనవరి నాటికి అవసరమైన అన్ని అనుమతులను క్రమబద్ధీకరించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన సమావేశంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. టెస్లాతో సహా ఇతర పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులిచ్చేలా చర్చలు జరిగాయని ఒక ఉన్నత అధికారి చెప్పినట్లు తెలిసింది. జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమావేశమయ్యారు. అప్పటినుంచి కామర్స్ అండ్ ఇండస్ట్రీ, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లాను భారత్‌కు తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. 2024 జనవరిలో అనుమతులు లభిస్తే టెస్లా కార్లను వీలైనంత త్వరలో భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు చర్చల్లో పురోగతి లేకపోవడంతో టెస్లా గతంలో భారత్‌లో ప్రవేశించలేదు. దాదాపు రూ.33లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 60% వరకే దిగుమతి సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40% ట్యాక్స్ ఉండేలా అభ్యర్థించింది. టెస్లా వాహనాలను ఎలక్ట్రిక్ కార్లుగా కాకుండా లగ్జరీ కార్లుగా గుర్తించాలని తెలిపింది. భారత్‌లో స్థానిక తయారీ యూనిట్‌ను స్థాపించడానికి ముందే తమ కార్ల విక్రయాన్ని ప్రారంభించాలని భావించింది. అయితే దిగుమతి సుంకం రాయితీల కోసం స్థానిక తయారీకి కట్టుబడి ఉండాలని ప్రభుత్వం చెప్పింది. కస్టమ్స్ డ్యూటీ రాయితీల స్థానంలో తయారీదారులకు ప్రత్యక్ష రాయితీలను అందిస్తూ, ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని టెస్లాకు వివరించింది. ఇదీ చదవండి: త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ భారత కస్టమ్స్ డ్యూటీ నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోకార్బన్ ఆధారిత వాహనాలను సమానంగా పరిగణిస్తారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి భారీగా సుంకాలను విధిస్తున్నారు. అయితే ఈవీ తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించేలా పర్యావరణ అనుకూల వాహనాలపై తక్కువ పన్ను విధించేలా కొత్త దిగుమతి పాలసీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వెసులుబాటు టెస్లాకు మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసే ఏ కంపెనీకైనా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. -
టెస్లా కారు రిపేర్ బిల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రపంచ ధనవంతుడైన ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా కార్లను కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుంటారు. అయితే ఇవి ఎలాంటి రిపేర్ రానంతవరకు సాఫీగానే ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా రిపేర్ వస్తే మాత్రం బిల్లు తడిసిమోపెడవుతుందనే వాదనలు ఉన్నాయి. ఇటీవల టెస్లా కారు ఓనర్ తన కారును రిపేర్ చేయించడానికి వెళ్తే ఏకంగా రూ.17.46లక్షలు బిల్లు వేసినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. టెస్లాకు సంబంధించిన 'స్కాటిష్ మోడల్ Y ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్' కారు కొనుగోలు చేసిన ఓనర్‌కు కంపెనీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వాహనాన్ని మరమ్మతు కోసం ఇవ్వగా.. టెస్లా వేసిన బిల్లు చూసి ఖంగుతిన్నాడు. ఏకంగా రూ.17.46 లక్షల బిల్లు వేశారు. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం..భారీగా వర్షం కురుస్తున్న సమయంలో యజమాని కారు నడిపాడు. వాహనం తీసుకున్న కొత్తలో కొంతకాలం పాటు బాగానే నడిచినా వర్షంలో తడిసిన తర్వాత స్టార్ట్ అవలేదు. ఈవీని ట్రక్ ద్వారా వర్క్‌షాప్‌కు తరలించడానికి ఓనర్ ఐదు గంటలు వేచి చూడాల్సి వచ్చింది. టెస్లా కస్టమర్ సర్వీస్ కూడా అంతగా సహాయపడలేదని యజమాని పేర్కొన్నాడు. టెస్లా వర్క్‌షాప్ యాజమాన్యం ఈ విషయంపై స్పందించింది. బ్యాటరీలోకి నీరు ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ పాడైందని తెలిపింది. ఇది ప్రొపల్షన్ సిస్టమ్ పై ప్రభావం చూపినట్లు వివరించింది. టెస్లా అందించే వారంటీ పరిధిలోకి ఇది రాలేదని స్పష్టం చేసింది. అయితే యజమానికి రూ.17.46లక్షల రిపేర్ బిల్లు రావడంపై వర్క్‌షాప్ మేనేజర్ని నిలదీసినట్లు నివేదిక వెల్లడించింది. భారీగా బిల్లులు వసూలు చేస్తూ టెస్లా గతంలోనూ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి బిల్ మరింత షాకింగ్ గా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్ సపోర్ట్ వల్ల అంతగా ఉపయోగం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
ఎలన్ మస్క్ ఆపసోపాలు, టిమ్ కుక్ అప్పుడే ప్రకటించేశాడు..?!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ సెల్ఫీ డ్రైవింగ్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైంది. మరో నాలుగేళ్లలో కారును మార్కెట్లో విడుదల చేసే లక్క్ష్యంగా ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. అయితే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. ఎలన్ మస్క్ ఫెయిల్ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను విడుదల చేసేందుకు కిందా మీదా పడుతున్నారని అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' గణాంకాలు చెబుతున్నాయి. ఎలన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ టెస్లాను సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేసేందుకు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. 2023లో ఎలన్ మస్క్ వినియోగదారులకోసం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అందుబాటులోకి తెస్తామని ఛాలెంజ్ చేశారు. అందుకోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కారు టెస్టింగ్‌ల్లో పెయిల్ అవుతూ వస్తుంది. అలా ఇప్పటి వరకు సుమారు 24 సార్లు ఫెయిల్ అయినట్లు, కారు ప్రమాదంలో పలువురు మరణించినట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇప్పుడు టెక్ దిగ్గజం యాపిల్ మరో అడుగు ముందుకేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేస్తామని చెప్పింది. దీంతో యాపిల్ షేర్లు మూడు శాతం పెరిగినట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. యాపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు యాపిల్ చేస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్ ప్రాజెక్ట్‌కు టైటాన్ అనే పేరు పెట్టింది. స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకుండా పూర్తిగా అటానమస్‌గా ఈ వాహనం ఉండనుంది. అంతేకాదు సెల్ఫ్ డ్రైవింగ్ కారు కోసం ప్రత్యేకంగా అదునాతన చిప్ సెట్‌ను రూపొందించనుంది. కానో సంస్థ తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ లిమోసిన్ స్టైల్ సీటింగ్ ను ఏర్పాటు చేయాలని అనుకుంది. ఇప్పుడు అదే సీటింగ్ స్టైల్‌ను యాపిల్ కారుకు డిజైన్ చేయాలని భావిస్తోంది. ఈ తరహాలో కారును డిజైన్ చేసి 2025 కల్లా కారును విడుదల చేయాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని బ్లూమ్ బెర్గ్ తన రిపోర్ట్‌లో తెలిపింది. చదవండి: Work From Home: చేసింది చాలు, యాపిల్ కీలక నిర్ణయం..! -
ఆదాయపు పన్ను కట్టని అమెజాన్ సీఈవో.. మరికొందరు?
వాషింగ్టన్: ఆదాయపు పన్ను కట్టడంలో ప్రపంచ కుబేరులు కక్కుర్తి పడ్డారు. బిలియన్ల కొద్ది ఆదాయం సమకూరుతున్నా పన్ను ఎగ్గొట్టేందుకు వెనుకాడలేదు. ఆదాయ పన్ను అవకతవకలపై ప్రోపబ్లికా రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. పన్ను కట్టలేదు ప్రపంచ కుబేరుల్లో ప్రథమ స్థానంలో అమెజాన్ సంస్థ సీఈవో జెఫ్ బేజోస్ ఉన్నారు. ఆదాయ పన్నుకి సంబంధించి 2007, 2011లలో ఆయన ఎటువంటి పన్ను చెల్లించలేదనే ఆరోపణలు ఆయన్ని చుట్టుముట్టాయి. జెఫ్‌తో పాటు టెస్లా కంపెనీ ఫౌండర్ ఎలన్మాస్క్ 2018లో ఇదే తీరుగా వ్యవహరించారని తాజా రిపోర్టులు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు బ్లూంబర్గ్ ఫౌండర్ మైఖేల్ బ్లూంబర్గ్, ఇన్వెస్టర్లు కార్ల్, జార్జ్ సోరోస్లు సైతం పన్ను తక్కువగా చెల్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ 2014 నుంచి 2018 వరకు రికార్డు స్థాయిలో 24.3 బిలియన్ల ఆదాయం సంపాదిస్తే ఆదాయపు పన్నుగా కేవలం 23.7 మిలియన్ డాలర్లు చెల్లించారు. డేటా లీక్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) రికార్డుల నుంచి సేకరించిన సమాచారంతో ఓ కథనాన్ని ప్రోపబ్లికా సంస్థ రిపోర్టు చేసింది. ఆ వెంటనే అమెరికాలో ఈ వార్తలు పెను దుమారం రేపాయి. దీంతో సంస్థకు సంబంధించిన రహస్య సమాచారం బయటకు ఎలా పొక్కిందనే అంశంపై విచారణ చేపడతున్నట్టు ఐఆర్ఎస్ కమిషనర్ ఛార్లెస్ రెట్టింగ్ ప్రకటించారు. టాక్స్ పేయర్స్ డాటాను కాపాడటం ఐఆర్ఎస్ బాధ్యతని సెనేట్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ రోన్వైడేన్ అన్నారు. అదే సమయంలో దేశంలోనే అత్యంత సంపన్నులు తమ వంతు పన్ను చెల్లించలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: టెక్ బిలియనీర్ చిలిపితనం.. ‘అడల్ట్’ అదృష్టం -
భారత్‌కు టెస్లా వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై కంపెనీ కార్లు పరుగులు తీయనున్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో ప్రవేశించనున్నట్టు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అక్టోబరు 2న టెస్లా క్లబ్ ఇండియా ట్వీట్‌కు సమాధానంగా వెల్లడించారు. 2016లోనే భారత్‌కు రావాలని భావించి బుకింగ్స్ కూడా స్వీకరించింది. ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ, ఈ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో కంపెనీ తన ఆలోచనను విరమించుకుంది. అయితే నాలుగేళ్ల క్రితం బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు తొలి ప్రాధాన్యత ఉండనుంది. ఆన్లైన్ వేదిక ద్వారా..: ఒకట్రెండేళ్ల వరకు డీలర్షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని టెస్లా నిర్ణయించింది. ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా మాత్రమే కార్యకలాపాలను నిర్వహించనుందని వాహన విక్రయంలో ఉన్న ప్రముఖ కంపెనీ ఎండీ ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇక భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుతోంది. తయారీ లేదా అసెంబ్లింగ్ ప్లాంటుతోపాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రం నెలకొల్పాలని భావిస్తోంది. ఈ విషయాలను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధ్రువీకరించారు. తొలుత విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి, అమ్మకాలనుబట్టి తయారీ ప్లాంటు నెలకొల్పుతుందని చెప్పారు. మోడల్–3కి జనవరిలో బుకింగ్స్: టెస్లా ముందుగా మోడల్–3 లగ్జరీ కారును ప్రవేశపెట్టనుంది. దీని కోసం జనవరిలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. పూర్తిగా తయారైన కారును ఇక్కడికి దిగుమతి చేయనున్నారు. కారు ధర రూ.55–60 లక్షలు ఉండనుంది. డెలివరీలు మార్చి చివరి నుంచి ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కంపెనీ తయారు చేసే కార్లలో ఇదే చవకైనది. ఒకసారి చార్జీ చేస్తే 381 నుంచి 580 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. -
కొత్త ఏడాదిలో మనకూ మోడల్-3 కార్లు!
న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో అమెరికన్ ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ దేశీయంగా అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా జనవరి నుంచి మోడల్-3 కార్ల బుకింగ్స్ ప్రారంభమయ్యే వీలున్న్టట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టెస్లా ఇంక్ తయారీ మోడల్-3 కార్లు అత్యంత వేగంగా విక్రయయవుతున్న విషయం విదితమే.. 2017లో మార్కెట్లో ప్రవేశించిన మోడల్-3 కార్లు ఎలక్ట్రిక్ విభాగంలో అత్యధిక అమ్మకాలను రికార్డును సాధించాయి. దీంతో ఈ ఏడాది(2020) టెస్లా ఇంక్ షేరు 700 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో కంపెనీకి చోటు లభించడం కూడా దోహదం చేసింది. కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్ అమ్మకాలలో మోడల్-3, మోడల్-Y కార్ల వాటా 89 శాతానికి చేరడం గమనార్హం! వెరసి మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రీత్యా ప్రపంచంలోనే టాప్ ఆటో కంపెనీగా టెస్లా ఇంక్ ఆవిర్భవించింది. (నాతో డీల్‌కు కుక్ నో చెప్పారు: మస్క్) 2016లోనే.. భారత మార్కెట్లో ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌లోనే టెస్లా ఇంక్ సీఈవో ఎలన్ మస్క్ ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా 2021 జనవరిలో మోడల్-3 కార్ల బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. తద్వారా జూన్‌చివరికల్లా కార్ల డెలివరీలను ప్రారంభించాలని టెస్లా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి 2016లోనే మస్క్ మోడల్-3 సెడాన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశారు. ఈ బాటలో వీటిని కొత్త ఏడాదిలో అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీ మార్కెట్లో కార్ల ధరలు రూ. 55-60 లక్షల మధ్య ఉండవచ్చని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఐకియా ఇండియా నష్టం రూ. 720 కోట్లు) పేటీఎమ్ నేత తొలుత 2016లోనే ఈకామర్స్ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మోడల్-3 కారును బుక్ చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో టెస్లా ఇంక్ కార్ల తయారీ ప్లాంటును సందర్శించారు కూడా. కాగా.. పారిశ్రామికవేత్తలు మహేష్ మూర్తి, విశాల్ గొండాల్, సుజయత్ అలీ తదితరులు 1,000 డాలర్లు చెల్లించడం ద్వారా మోడల్-3 కార్లను బుక్ చేసుకున్నట్లు ఆటో వర్గాలు పేర్కొన్నాయి. మోడల్-3 కారు 500 కిలోమీటర్లు ప్రయాణించగలదని, గంటకు 162 మైళ్ల వేగాన్ని సాధించగలదని తెలియజేశాయి. 0-60 మైళ్ల స్పీడ్‌ను 3.1 సెకండ్లలోనే అందుకోగలదని వెల్లడించాయి. ఇప్పటికే టెస్లా ఇంక్.. మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను ఆశించిన స్థాయిలో విక్రయిస్తున్నట్లు తెలియజేశాయి. ఇకపై మోడల్-3 కారు విక్రయాలను మరింత పెంచే ప్రణాళిల్లో ఉన్నట్లు తెలియజేశాయి. ఈ బాటలో భారత్ మార్కెట్‌పై దృష్టి సారించినట్లు వివరించాయి. ఇందుకు వీలుగా భారత్‌లో ప్లాంటు ఏర్పాటుపైనా ఆసక్తిని చూపుతున్నట్లు వెల్లడించాయి. -
టెస్లా జోరు- ఇక ఎస్అండ్పీలో చోటు!
టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రిక్ కార్ల అమెరికన్ దిగ్గజం టెస్లా ఇంక్.. ఇటు ఆర్థిక ఫలితాలు, ఆటు షేరు ర్యాలీలోనూ జోరు చూపుతోంది. ఈ ఏడాది(2020) రెండో త్రైమాసికంలో 10.4 కోట్ల డాలర్ల(రూ. 780 కోట్లు) నికర లాభం ఆర్జించింది. తద్వారా వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను సాధించింది. దీంతో ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో చోటు సాధించేందుకు అర్హత సాధించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. క్యూ2(ఏప్రిల్-జూన్)లో టెస్లా మొత్తం ఆదాయం 6.04 బిలియన్ డాలర్లను తాకింది. కాగా.. బుధవారం 1.5 శాతం బలపడి 1592 డాలర్ల వద్ద ముగిసిన షేరు ఫ్యూచర్స్‌లో మరో 4.5 శాతం ఎగసింది. ఇప్పటికే కంపెనీ మార్కెట్ విలువ 295 బిలియన్ డాలర్లను దాటడంతో ఆటో దిగ్గజం టయోటాను వెనక్కి నెట్టింది. వెరసి మార్కెట్ విలువ రీత్యా ఆటో రంగంలో అత్యంత విలువైన కంపెనీగా టెస్లా నిలుస్తోంది. టెస్లా షేరు 12 నెలల్లో 500 శాతం ర్యాలీ చేయగా.. 2020లో ఇప్పటివరకూ 200 శాతంపైగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే! కారణాలున్నాయ్ కోవిడ్-19 అనిశ్చితులలోనూ క్యూ2లో టెస్లా ఇంక్ అంచనాలను అధిగమిస్తూ 90,650 వాహనాలను విక్రయించగలిగింది. మోడల్ 3, మోడల్ Y కార్లకు ఏర్పడిన డిమాండ్ ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఈ రెండు మోడళ్ల కార్లను రూపొందించేందుకు తాజాగా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో 110 కోట్ల డాలర్ల(రూ. 8250 కోట్లు) అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ప్రకటించారు. తద్వారా 5,000 మందివరకూ ఉపాధి లభించనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే మూడు ప్లాంట్లను కలిగి ఉంది. ఇటీవల యూఎస్‌లో భారీ ఆసక్తి నెలకొన్న కంపెనీ తయారీ మోడల్ 3 కారు ప్రారంభ ధర 38,000 డాలర్లు(రూ. 28.5 లక్షలు) అంటూ విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. తొలుత దైమ్లర్తో జత 134 ఏళ్ల క్రితమే ఆధునిక కార్ల తయారీని ప్రారంభించిన జర్మన్ దిగ్గజం.. దైమ్లర్ 2009 మే నెలలో టెస్లా ఇంక్‌లో 10 శాతం వాటాను సొంతం చేసుకుంది. తద్వారా టెక్నాలజీ ఆధారిత కార్ల తయారీపై దృష్టితో ప్రారంభమైన స్టార్టప్.. టెస్లా ఇంక్‌కు 5 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. అయితే తదుపరి కాలంలో టెస్లా తయారీ టెక్నాలజీ ఆధారిత కార్లను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడంపై దైమ్లర్ సందేహించినట్లు తెలుస్తోంది. దీంతో 2014 డిసెంబర్లో టెస్లాలో గల 10 శాతం వాటాను దైమ్లర్ విక్రయించింది. అయితే దైమ్లర్తో జట్టుకట్టడం ద్వారా టెస్లా.. కార్ల దీర్ఘకాలిక భద్రత, నియంత్రణ తదితర అంశాలను అవగాహన చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది తదుపరి దశలో కంపెనీకి ఉపయుక్తంగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు. -
‘100 రోజుల్లో ఆస్ట్రేలియాను గట్టెక్కిస్తా’
విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న దక్షిణ ఆస్ట్రేలియాను టెస్లా ఇంక్ బాస్ ఎలోన్ మస్క్ ఆ సంక్షోభం నుంచి బయటపడేయనున్నారట. 100 రోజుల్లో ఆస్ట్రేలియాను విద్యుత్ సంక్షోభం నుంచి గట్టేకిస్తానని, లేనిపక్షంలో ఉచితంగా తమ సేవలందించనున్నట్టు మస్క్ తెలిపారు. బిలియనీర్ ఎంటర్ ప్రిన్యూర్ మైక్ కానన్-బ్రూక్స్ ఛాలెంజ్ పై స్పందించిన మస్క్ ఈ ఆఫర్ ను ప్రకటించారు. మస్క్.. ఎంత వరకు ఈ విషయంపై సీరియస్ గా ఉన్నావు? 100 రోజుల్లో 100 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు గ్యారెంటీ ఇవ్వగలవా? అనే సవాల్ ను టెస్లా వ్యవస్థాపకుడికి మైక్ కానన్ విసిరారు. 17 లక్షల ప్రజలున్న దక్షిణ ఆస్ట్రేలియా విద్యుత్ కోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత సెప్టెంబర్ లో వచ్చిన తుఫాను అనంతరం విద్యుత్ తీగలన్నీ దెబ్బతిని దక్షిణ ఆస్ట్రేలియా అంధకారంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆ ప్రాంతాన్ని వీడి వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. తుఫాను అనంతరం ఆ రాష్ట్రంలో వడగాలులు మరో బీభత్సం సృష్టించాయి. అప్పటినుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రాధాన్యత ప్రకారం సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. గ్రిడ్ స్టోరేజ్ పెంపును కూడా చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ కారు, బ్యాటరీ మేకర్ టెస్లా వ్యవస్థాపకుడు మస్క్ ఈ ఆఫర్ ను దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకొచ్చారు. 25 మిలియన్ డాలర్ల విలువైన 100 మెగావాట్ అవర్స్ బ్యాటరీ స్టోరేజ్ ను అందించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాజకీయ మద్దతు ఇప్పించడానికి, ఫండింగ్ కల్పించడానికి కెనూన్-బ్రూక్స్ కూడా సహాయం చేయనున్నట్టు తెలిపారు. అయితే ఈ విషయంపై ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వెంటనే స్పందించలేదు. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన సారా హన్సన్-యంగ్ సెనేటర్ మాత్రం ఈ ఆఫర్ పై మస్క్ తో చర్చించనున్నట్టు తెలిపారు.