స్మార్ట్‌ బస్సులు వచ్చేశాయి!? | smart buses begin trial operation | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ బస్సులు వచ్చేశాయి!?

Published Sun, Dec 3 2017 1:00 PM | Last Updated on Sun, Dec 3 2017 7:44 PM

smart buses begin trial operation - Sakshi

ఇప్పటివరకూ కలలు కంటున్న స్మార్ట్‌/సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సులు శనివారం ఉదయం నుంచి చైనాలోని షెన్‌జెన్‌ సిటీలో పరుగులు తీస్తున్నాయి.

అత్యంత ఆధునాతన నగరమైన షెన్‌జెన్‌లో దాదాపు 70 శాతం ఐటీ సంస్థలున్నాయి. ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కొసం ఈ స్మార్ట్‌ బస్సులును అధికారులు ప్రవేశపెట్టారు. రెండు కిలోమీటర్ల పరిధిలో.. ఈ బస్సులు ప్రయాణిస్తాయి. స్మార్ట్‌ బస్సులు.. కనిష్టంగా 10 కి.మీ. గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 

స్మార్ట్‌ బస్సులకు జీపీఎస్‌ ఆంటెన్నా, హై రెజ్యుల్యూషన్‌తో కూడిన హెచ్‌డీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆటో సెన్సార్‌ టెక్నాలజీ ద్వారా పాదచారులను ఈ బస్సు ఢీ కొట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే.. బస్సులో ఉండే డ్రైవర్‌.. స్మార్ట్‌ నుంచి మ్యాన్యువల్‌ డ్రైవింగ్‌కు మార్చి బస్సును నడిపిస్తాడు. ఈ స్మార్ట్‌ బస్సులను షెంజెన్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ గ్రూప్‌ రూపోందించడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement