
గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారుకు యాక్సిడెంట్
గూగుల్ కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు తొలిసారి ఓ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బస్సును ఇది ఢీకొట్టింది. ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెల్ఫ్ డ్రైవింగ్ కారు కదలకపోయినా ప్రమాదం జరిగి ఉండేది కాదని, తాను కంప్యూటర్ సిస్టమ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నా ఈ ప్రమాదం జరిగేది కాదని సెల్ఫ్ డ్రైవింగ్ కారును పర్యవేక్షిస్తున్న కంపెనీ ఆపరేటర్ తెలిపారు.
గూగుల్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే జరిగిన ఈ ప్రమాదం గురించి కాలిఫోర్నియా మోటార్ వాహనాల విభాగం ముందు గూగుల్ ప్రతినిధి హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంది. ఎదురుగా వస్తున్న చిన్న వాహనాలను సులభంగా గుర్తించే తమ కారు.. ఎదురుగా వస్తున్న పెద్ద బస్సును సరిగ్గా గుర్తించలేక పోయిందని, త్వరలోనే పెద్ద వాహనాలను గుర్తించేలా సత్వర చర్యలు తీసుకుంటామని గూగుల్ యాజమాన్యం తెలిపింది.