
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ఈ నెల 15న జరగనున్న డబ్ల్యూపీఎల్ వేలంలో అందుబాటులో ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి.
గుజరాత్ నలుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా... యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోనుంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. భారత ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా రూ. 30 లక్షల కనీస ధరతో వేలానికి రానుండగా... విదేశీ ప్లేయర్లలో డాటిన్ (వెస్టిండీస్), హీథర్ నైట్ (ఇంగ్లండ్)పై అదరి దృష్టి నిలవనుంది. వీరిద్దరూ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment