సీమాంధ్ర పాలక వర్గాల కుట్రలను తిప్పి కొట్టకపోతే తెలంగాణ రాష్ట్రం అస్థిరత్వం పాలై మళ్లీ 1956 మాదిరిగానే వలస పాలనలోకి వచ్చే ప్రమాద ఉందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ హెచ్చరించారు.
తెలంగాణ వికాస సమితి ఆవిర్భావ సభలో హరగోపాల్
సాక్షి,హైదరాబాద్: సీమాంధ్ర పాలక వర్గాల కుట్రలను తిప్పి కొట్టకపోతే తెలంగాణ రాష్ట్రం అస్థిరత్వం పాలై మళ్లీ 1956 మాదిరిగానే వలస పాలనలోకి వచ్చే ప్రమాద ఉందని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ హెచ్చరించారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎంతో బలహీన పడ్డారని, ఏం చెప్పినా వినడం లేదని విమర్శించారు.
అధికారంలోకి వచ్చాక ప్రతిఒక్కరూ ఇలానే వ్యవహరిస్తారని అభిప్రాపడ్డారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘తెలంగాణ వికాస సమితి’ ఆవిర్భావసభలో హరగోపాల్ మాట్లాడారు. కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న దేశపతి శ్రీనివాస్ కన్వీనర్‌గా ఈ సమితిని ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని, టీఆర్‌ఎస్ వాళ్లే పెట్టించారనే ప్రచారం బయట జరుగుతోందన్నారు. కవి నందిని సిధారెడ్డి, ఉద్యోగ సంఘాల నేత విఠల్, టీయూడబ్ల్యూజె కార్యదర్శి విరాసత్ అలీ తదితరులు పాల్గొన్నారు.