భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) 8వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లో ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగనున్నాయి. దేశ ప్రజల నవనాడు లనూ పెకిలించివేస్తున్న సామ్రాజ్యవాద, ప్రపంచీక రణలకు వ్యతిరేకంగా అన్ని ప్రజాపోరాట శక్తులను కలుపుకుని పోరాడటం అత్యంత ఆవశ్యకమైన పరి స్థితుల్లో ఇఫ్టూ మహాసభలు జరగనున్నాయి. మార్చి 13న హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కునుంచి ఉదయం 11 గంటలకు కార్మికుల ప్రదర్శన మొదలవుతుంది.
తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఇంది రాపార్కులో బహిరంగ సభ జరుగుతుంది. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణ సభకు అధ్యక్షత వహిస్తారు. విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్, ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, న్యూడెమో క్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వేములపల్లి వెంక ట్రామయ్య ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఉపా ధ్యక్షులు జె.శ్రీనివాస్, రాష్ట్రకమిటీ సభ్యులు ఎస్. ఎల్.పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు జి. ఝాన్సీ ఈ బహిరంగ సభలో వక్తలుగా ఉపన్యసించను న్నారు. మార్చి 14, 15 తేదీల్లో కా॥యు.రాములు నగర్ (వీఎస్‌టీ ఫంక్షన్ హాల్)లో జరిగే ప్రతినిధుల సభకు ప్రముఖ పాత్రికేయులు సతీశ్‌చందర్ ఆహ్వా నం పలుకగా, ఇఫ్టూ జాతీయ కార్యదర్శి పి. ప్రసాద్, ఇఫ్టూ జాతీయ అధ్యక్షులు డి.వి. కృష్ణ ప్రారంభ, ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.
ఈ సభ నేపథ్య విషయానికి వస్తే...విదేశీ ప్రత్యక్ష పాలన వీడినా దేశానికి స్వతంత్రత చేకూర లేదు. కేవలం అధికార మార్పిడి జరిగింది. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నా యి. మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ పాలించినా బీజేపీ, ఇతర పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి. పదేళ్ల యూపీఏ పాలన అన్నిరంగాల్లో భ్రష్టు పట్టిపోయిం ది. లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది. ప్రజల్లో పేరుకు పోయిన అసం తృప్తిని సొమ్ము చేసుకుని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తు న్నారు.
బహుళజాతి సంస్థలకూ, పెట్టుబడిదారు లకూ వకాల్తా పుచ్చుకున్నారు. చవక శ్రమ ద్వారా దోపిడీని మరింత పెంచుకోమంటున్నారు. వారికి అవసరమైన కార్మిక చట్టాలను మార్చేస్తున్నారు. రైతుల అభీష్టంతో సంబంధం లేకుండా భూమిని లాక్కునే ఆర్డినెన్స్‌ను సవరించాడు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పాలన మాటలు కోట లు దాటినా కాళ్లు గడపదాటవు చందంగా సాగుతోం ది. ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్టు కార్మికుల క్రమబ ద్ధీకరణ, అసంఘటిత కార్మికుల కనీస వేతన నిర్ణ యం గుర్తున్నట్లు కనబడటం లేదు.
125 కోట్ల భారతదేశంలో 44 కోట్లమంది కార్మికులు జీవిస్తున్నారు. ఇందులో తగిన జీవన భద్రత కలిగిన సంఘటిత కార్మిక వర్గం కేవలం 4 కోట్లు మాత్రమే. మిగతా 40 కోట్లమంది కార్మిక వర్గం హక్కులు లేని, కనీస వేతనం లేని ఉద్యోగ భద్రత లేని జీవులుగా మిగిలి ఉన్నారు. దేశజనాభా లో 40 శాతానికి పైగా కార్మిక వర్గం ఏ అవసరాలు తీరని, పోషకాహార లేమితో అనారోగ్యంతో, దారి ద్య్రంతో, బతుకులీడుస్త్తున్నారు. ఈ స్థితికి వ్యతిరేకం గా పోరాడాల్సిన ఆవశ్యకత మనపై ఉంది.
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహించింది. కార్మిక వర్గాన్ని కూడగట్టింది. అనేక రంగాల కాంట్రాక్ట్ వర్కర్స్, సింగరేణి, బీడీ, భవన, జూట్, మోటారు, విద్యుత్ తదితర అనేక రంగాల్లో యూనియన్ నిర్మా ణం చేసింది. తక్షణ కర్తవ్యంగా అసంఘటిత కార్మికు లకు 15 వేల వేతనం, షరతులు లేకుండా బీడీ కార్మి కులందరికీ వెయ్యి రూపాయల జీవన భృతి కోసం పోరాడాల్సి ఉంది. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అన్ని శక్తులను కలుపుకుని పోరాడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మార్చి 13, 14, 15 తేదీల్లో జరుగుతున్న ఇఫ్టూ 8వ మహాసభల సందర్భంగా గత ఉద్యమాన్ని సమీక్షించుకుని భవి ష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవాలి. అందుకు గానూ మార్చి 13న వేలాదిగా కార్మికులు హాజరయి ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. మార్చి 14, 15 తేదీల్లో జరగనున్న ప్రతినిధుల సభకు అండగా నిలవాల్సిం దిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
(నేటి నుంచి హైదరాబాద్‌లో ఇప్టూ 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా)
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ)
తెలంగాణ రాష్ట్ర కమిటీ
ప్రపంచీకరణపై ఐక్యపోరాటం ఆవశ్యం
Published Fri, Mar 13 2015 12:44 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement