sundarayya park
-
'ఓటమిని భరించలేకనే వామపక్షాలపై దాడి'
హైదరాబాద్ : కేరళ ఎన్నికల్లో ఓటమిని భరించలేకనే వామపక్షాలపై మతోన్మాద శక్తులు దాడి చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. డిల్లీలోని సీపీఎం కేంద్రం కమిటీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడిచేసినందుకు నిరసనగా సోమవారం సుందరయ్య పార్కు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మతోన్మాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..దాడులు చేయటం అమానుషమని, కేరళలో విజయోత్సవం జరుపుకుంటున్న సమయంలో బాంబులు వేస్తే ఒకరు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారని, అక్కడ దుండగులను అరెస్టు చేసినందుకే మళ్లీ ఢిల్లీలో దాడులు చేశారని విమర్శించారు. దేశంలో సామాజిక, సాంస్కృతిక సంస్థలపై చేస్తున్న దాడిలో భాగంగానే మాపై దాడి చేశారని అన్నారు. ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమై ఇలాంటి దాడులను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా ఇలాంటి శక్తులను ఎదుర్కొంటామని, వారిని ఒక్క అడుగు కూడ ముందుకు వేయనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య, డీజీ.నర్సింగరావు, టి.జ్యోతి, జె.వెంకటేశ్, నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, టి.సాగర్, భూపాల్,ఎస్.రమ, బి.హైమావతి, ఆర్.శ్రీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి నేతలు రాజీనామా చేయాలి
ఏడు వామపక్ష పార్టీల ర్యాలీలో నేతల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: అవినీతిలో కూరుకుపోయిన కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, స్మృతీఇరానీ, బీజేపీ సీఎంలు శివరాజ్‌చౌహాన్, వసుంధరరాజే పదవులకు రాజీనామా చేయాలని ఏడు వామ పక్షాలు డిమాండ్చే శాయి. సోమవారం సుందరయ్యపార్కు నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీని నిర్వహించాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా,సృ్మతీ, శివరాజ్, వసుంధరల మాస్కులను ధరించి వామపక్షాల కార్యకర్తలు నిరసన తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐనేత కె.నారాయణ మాట్లాడుతూ అవినీతిని నిర్మూలిస్తామని సామాన్యులకు మంచిరోజులు వస్తాయన్న వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడాదికిపైగా జరిపిన పాలన అవినీతికి చట్టబద్ధను కల్పించేదిగా ఉందని ధ్మజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో ‘వ్యాపం’ కుంభకోణం, మహారాష్ట్రలో వెలుగుచూస్తున్న అవినీతిలో బీజేపీ నాయకుల హస్తం ఉందన్నారు. కేంద్రమంత్రుల అవినీతి బయటపడినా ప్రధాని వారిని కేబినెట్‌లోంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వారితో రాజీనామా చేయించాలి లేదా అవినీతితో సంబంధమున్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నేత డీజీనరసింహారావు మాట్లాడుతూ దేశవిదేశాలతో ముడిపడిన అవినీతి కార్యక్రమాలతో కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, పార్టీ నాయకులకు సంబంధాలున్నా దీనిపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆర్ఎస్పీ నేత జానకిరాములు మాట్లాడుతూ మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వంలో అవినీతి భాగోతాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించాలని డిమాండ్‌చేశారు. ఎస్‌యూసీఐ నేత శ్రీధర్ ప్రసంగిస్తూ మంత్రులు, పార్టీనాయకులు అవినీతిలో మునిగినా వారిపై చర్య తీసుకోకుండా కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. -
ప్రపంచీకరణపై ఐక్యపోరాటం ఆవశ్యం
భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) 8వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లో ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగనున్నాయి. దేశ ప్రజల నవనాడు లనూ పెకిలించివేస్తున్న సామ్రాజ్యవాద, ప్రపంచీక రణలకు వ్యతిరేకంగా అన్ని ప్రజాపోరాట శక్తులను కలుపుకుని పోరాడటం అత్యంత ఆవశ్యకమైన పరి స్థితుల్లో ఇఫ్టూ మహాసభలు జరగనున్నాయి. మార్చి 13న హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కునుంచి ఉదయం 11 గంటలకు కార్మికుల ప్రదర్శన మొదలవుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఇంది రాపార్కులో బహిరంగ సభ జరుగుతుంది. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణ సభకు అధ్యక్షత వహిస్తారు. విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్, ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, న్యూడెమో క్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వేములపల్లి వెంక ట్రామయ్య ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, ఉపా ధ్యక్షులు జె.శ్రీనివాస్, రాష్ట్రకమిటీ సభ్యులు ఎస్. ఎల్.పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు జి. ఝాన్సీ ఈ బహిరంగ సభలో వక్తలుగా ఉపన్యసించను న్నారు. మార్చి 14, 15 తేదీల్లో కా॥యు.రాములు నగర్ (వీఎస్టీ ఫంక్షన్ హాల్)లో జరిగే ప్రతినిధుల సభకు ప్రముఖ పాత్రికేయులు సతీశ్‌చందర్ ఆహ్వా నం పలుకగా, ఇఫ్టూ జాతీయ కార్యదర్శి పి. ప్రసాద్, ఇఫ్టూ జాతీయ అధ్యక్షులు డి.వి. కృష్ణ ప్రారంభ, ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. ఈ సభ నేపథ్య విషయానికి వస్తే...విదేశీ ప్రత్యక్ష పాలన వీడినా దేశానికి స్వతంత్రత చేకూర లేదు. కేవలం అధికార మార్పిడి జరిగింది. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నా యి. మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ పాలించినా బీజేపీ, ఇతర పార్టీలు కూడా అధికారంలో ఉన్నాయి. పదేళ్ల యూపీఏ పాలన అన్నిరంగాల్లో భ్రష్టు పట్టిపోయిం ది. లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది. ప్రజల్లో పేరుకు పోయిన అసం తృప్తిని సొమ్ము చేసుకుని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తు న్నారు. బహుళజాతి సంస్థలకూ, పెట్టుబడిదారు లకూ వకాల్తా పుచ్చుకున్నారు. చవక శ్రమ ద్వారా దోపిడీని మరింత పెంచుకోమంటున్నారు. వారికి అవసరమైన కార్మిక చట్టాలను మార్చేస్తున్నారు. రైతుల అభీష్టంతో సంబంధం లేకుండా భూమిని లాక్కునే ఆర్డినెన్స్‌ను సవరించాడు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పాలన మాటలు కోట లు దాటినా కాళ్లు గడపదాటవు చందంగా సాగుతోం ది. ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్టు కార్మికుల క్రమబ ద్ధీకరణ, అసంఘటిత కార్మికుల కనీస వేతన నిర్ణ యం గుర్తున్నట్లు కనబడటం లేదు. 125 కోట్ల భారతదేశంలో 44 కోట్లమంది కార్మికులు జీవిస్తున్నారు. ఇందులో తగిన జీవన భద్రత కలిగిన సంఘటిత కార్మిక వర్గం కేవలం 4 కోట్లు మాత్రమే. మిగతా 40 కోట్లమంది కార్మిక వర్గం హక్కులు లేని, కనీస వేతనం లేని ఉద్యోగ భద్రత లేని జీవులుగా మిగిలి ఉన్నారు. దేశజనాభా లో 40 శాతానికి పైగా కార్మిక వర్గం ఏ అవసరాలు తీరని, పోషకాహార లేమితో అనారోగ్యంతో, దారి ద్య్రంతో, బతుకులీడుస్త్తున్నారు. ఈ స్థితికి వ్యతిరేకం గా పోరాడాల్సిన ఆవశ్యకత మనపై ఉంది. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) రాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహించింది. కార్మిక వర్గాన్ని కూడగట్టింది. అనేక రంగాల కాంట్రాక్ట్ వర్కర్స్, సింగరేణి, బీడీ, భవన, జూట్, మోటారు, విద్యుత్ తదితర అనేక రంగాల్లో యూనియన్ నిర్మా ణం చేసింది. తక్షణ కర్తవ్యంగా అసంఘటిత కార్మికు లకు 15 వేల వేతనం, షరతులు లేకుండా బీడీ కార్మి కులందరికీ వెయ్యి రూపాయల జీవన భృతి కోసం పోరాడాల్సి ఉంది. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అన్ని శక్తులను కలుపుకుని పోరాడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మార్చి 13, 14, 15 తేదీల్లో జరుగుతున్న ఇఫ్టూ 8వ మహాసభల సందర్భంగా గత ఉద్యమాన్ని సమీక్షించుకుని భవి ష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవాలి. అందుకు గానూ మార్చి 13న వేలాదిగా కార్మికులు హాజరయి ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. మార్చి 14, 15 తేదీల్లో జరగనున్న ప్రతినిధుల సభకు అండగా నిలవాల్సిం దిగా విజ్ఞప్తి చేస్తున్నాం. (నేటి నుంచి హైదరాబాద్‌లో ఇప్టూ 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా) భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ -
సర్కారీ హత్యలే : బీవీ రాఘవులు ఆగ్రహం
హైదరాబాద్, న్యూస్‌లైన్: అత్యవసర సేవల విభాగమైన 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ప్రతిరోజూ హత్యలు చేస్తోందని, వైద్యసేవలు అందక ప్రజలు చనిపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 20 రోజు లుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం చలో హైదరాబాద్ చేపట్టారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకూ 108 ఉద్యోగులు భారీ ప్రదర్శన జరిపారు. అనంతరం ధర్నాచౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాఘవులు ప్రసంగించారు. ప్రభుత్వ సొమ్ముతో 108ను నిర్వహిస్తుండగా సోకు మాత్రం జీవీకే యాజమాన్యానికి దక్కుతోందన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న జీవీకే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం రూ.15 వేలు కూడా వేతనం లేకపోవటం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఎంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, రాములు, భూపాల్, ఏవీ నాగేశ్వరరావు, 108 ఎంపాయీస్ నాయకులు అప్పిరెడ్డి, సూర్యనారాయణ, బలరాం, శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, శంకర్ రెడ్డి, వీరస్వామి, కిరణ్, శివ పాల్గొన్నారు. 108 ఉద్యోగుల భారీ ర్యాలీ: ధర్నా సందర్భంగా 108 సిబ్బంది సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ 108 యాజమాన్యం 256 మందిని అకారణంగా డిస్మిస్ చేయటంతో పాటు 108 మందిని జైలుకు పంపిందన్నారు.