రేవంత్‌కు అదానీతో ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ: హరీశ్‌రావు | Harisharao Slams Telangana Cm Revanthreddy On Adani Issue | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు అదానీతో ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ: హరీశ్‌రావు

Published Wed, Dec 18 2024 3:25 PM | Last Updated on Wed, Dec 18 2024 4:05 PM

Harisharao Slams Telangana Cm Revanthreddy On Adani Issue

సాక్షి,హైదరాబాద్‌:రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోందని, అదానీతో ఆయన ఢిల్లీలో దోస్తీ,గల్లీలో కుస్తీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ిమర్శించారు. బుధవారం(డిసెంబర్‌ 18) అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

‘రాజ్ భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. మేము అదానీ ఫొటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న 12 వేల కోట్ల రూపాయల ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. అదానీపై రేవంత్‌ పోరాటం నిజమైతే ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకోవడం లేదు. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రేవంత్ అనుమతులు ఇస్తున్నారు. అదానీకి రేవంత్ కొమ్ముకాస్తున్నారు.

రోడ్డుపై రేవంత్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారు.రేవంత్ అదానీకి ఏజెంట్‌లా పని చేస్తున్నారు.అదానీకి రెడ్‌కార్పెట్ వేసి తెలంగాణ పరువును రాహుల్ గాంధీ పరువును రేవంత్ రెడ్డి మంటకలిపారు. రేపు అసెంబ్లీలో అదానీ,రేవంత్‌రెడ్డి లింకుపై చర్చ పెట్టాలి. రాజ్ భవన్ ముట్టడిలో అదానీ గురించి రేవంత్ మాట్లాడలేదు. రేవంత్‌రెడ్డిని పార్టీ తిడితే 100 కోట్లు అదానీకి వాపస్ ఇచ్చారు.చట్టం అందరికీ సమానం అయితే రోడ్డుపై ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలపై సీవీ ఆనంద్ కేసులు పెట్టాలి’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌రావు కామెంట్స్‌..

  • సీఎం ప్రకటన చేస్తే  అమలు చేయాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు..
  • నవంబర్ 30 న 3 లక్షల 13 వేల మంది రైతులకు రెండో సారి రుణ మాఫీ చేసున్నం అన్నాడు
  • ఇంత వరకు 3 లక్షల 13 మంది రైతులకు 2474 కోట్లు ఖాతాలో పడలేదు
  • 19 నవంబర్ వరంగల్ స్వయం సంఘాల ఖాతాల్లో నగదు పడలేదు
  • ఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరిలో రూ.281 పీఆర్సీ బకాయిలు కూడా జమ కాలేదు
  • అది చివరకు ఆర్టీసీ సంస్థనే మళ్ళీ వారి ఖాతాలో వేసింది
  • లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తాం అని చాలా సార్లు చెప్పారు.
  • కానీ ఇదో పెద్ద బోగస్ అని తేలిపోయింది.
  • 2015లోనే బీఆర్ఎస్ 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చినం..
  • ఇప్పుడు కాంగ్రెస్ ఇదే ఇస్తోంది.రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు. మిగత వాటికి వడ్డీ కట్టాల్సిందే.
  • లక్ష కోట్లు అని చెప్పింది అంత అబద్ధం
  • ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ ఒక్కటీ ఇవ్వడం లేదు
  • తులం బంగారంలేదు,స్కూటీ లేదు,న్యూట్రిషన్ కిట్ లేదు
  • ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు.
  • అన్ని ఉత్త మాటలే
  • బతుకమ్మ చీరలు లేవు
  • రూల్స్ ప్రకారం సభను నడపడం లేదు.
  • నాడు భట్టి,శ్రీధర్ బాబు ప్లకార్డులు పట్టుకోలేదా..ఇవాళ ఇదేం న్యాయం.
  • పార్లమెంట్ లో మాత్రం ప్రియాంక గాంధీ రోజు ఒక బ్యాగ్ వేసుకోవచ్చు,రాహుల్ గాంధీ రోజు టీ షర్ట్ వేసుకోవచ్చు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement