సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసు వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం(డిసెంబర్ 20) హరీశ్‌రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాం.రేవంత్ అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టు చేయవద్దని హైకోర్టు చెప్పింది.
ఇది డొల్ల కేసు అని హైకోర్టు చెప్పింది. ఈ కార్ రేసుల వల్ల తెలంగాణకు లాభం జరిగింది.రూ.600 కోట్ల నష్టం కాదు..రూ.600 కోట్ల లాభం జరిగింది. అవినీతి జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినప్పుడు ఇక ఏసీబీ కేసు ఎందుకు. హామీలపై ప్రజల దృష్టిని మరల్చి జిమ్మిక్కులు చేస్తున్నారు’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కాగా, ఫార్ములా ఈ కార్ రేసుల కేసులో ఏసీబీ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1 చేర్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీంతో కేటీఆర్ కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో హైకోర్టు కేటీఆర్‌కు ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment