సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షహోదా కోసం బావబామ్మర్దులు హరీశ్‌రావు,కేటీఆర్ కొట్టుకుంటున్నారని ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సోమవారం(సెప్టెంబర్23) ఐలయ్య మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు.‘కేసీఆర్ రైతులను ముంచాడు.హరీష్ డెయిరీలను నాశనం చేశాడు.
ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం బావబామ్మర్ధులు కొట్టుకుంటున్నారు. ప్రజారోగ్యంపై కేటీఆర్ కమిటీ వేయడం సిగ్గుమాలిన పని.ప్రజాపాలనకి వస్తున్న ఆదరణ చూసి రంగా,బిల్లాలు ఓర్వలేకపోతున్నారు.గాంధీ హాస్పిటల్ సిబ్బంది మనోధైర్యం దెబ్బతీసేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.పడేండ్లలో ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ గురించి ఆలోచించారా?
డీప్యూటీ సీఎం గా పనికిరాని రాజయ్య ఈరోజు అవసరం వచ్చారా? దళితున్ని ముందు పెట్టి డ్రామాలాడుతున్నారు. పదేండ్లలో ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోయారు?స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారు.హరీశ్‌రావు డెయిరీ కోసం విజయ డైరీ,మదర్ డైరీని గత పదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారు.గత పదేళ్లలో డెయిరీల్లో బీఆర్ఎస్ నాయకులు పంది కొక్కుల్లా మెక్కారు.డెయిరీల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపిస్తాం’అని తెలిపారు.
ఇదీ చదవండి.. హైడ్రా పేరుతో హైడ్రామాలు: హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment