ailaiah
-
‘ఎల్ఓపీ’ సీటు కోసం కేటీఆర్, హరీశ్ ఫైట్: విప్ ఐలయ్య
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షహోదా కోసం బావబామ్మర్దులు హరీశ్‌రావు,కేటీఆర్ కొట్టుకుంటున్నారని ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సోమవారం(సెప్టెంబర్23) ఐలయ్య మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు.‘కేసీఆర్ రైతులను ముంచాడు.హరీష్ డెయిరీలను నాశనం చేశాడు.ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం బావబామ్మర్ధులు కొట్టుకుంటున్నారు. ప్రజారోగ్యంపై కేటీఆర్ కమిటీ వేయడం సిగ్గుమాలిన పని.ప్రజాపాలనకి వస్తున్న ఆదరణ చూసి రంగా,బిల్లాలు ఓర్వలేకపోతున్నారు.గాంధీ హాస్పిటల్ సిబ్బంది మనోధైర్యం దెబ్బతీసేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.పడేండ్లలో ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ గురించి ఆలోచించారా? డీప్యూటీ సీఎం గా పనికిరాని రాజయ్య ఈరోజు అవసరం వచ్చారా? దళితున్ని ముందు పెట్టి డ్రామాలాడుతున్నారు. పదేండ్లలో ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోయారు?స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారు.హరీశ్‌రావు డెయిరీ కోసం విజయ డైరీ,మదర్ డైరీని గత పదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారు.గత పదేళ్లలో డెయిరీల్లో బీఆర్ఎస్ నాయకులు పంది కొక్కుల్లా మెక్కారు.డెయిరీల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపిస్తాం’అని తెలిపారు.ఇదీ చదవండి.. హైడ్రా పేరుతో హైడ్రామాలు: హరీశ్‌రావు -
రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
కవాడిగూడ (హైదరాబాద్): మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గొల్లకురుమల వృత్తిని కించపరిచేలా, యాదవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనికి రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మ న్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ యాదవ, కురుమ సంఘాల జేఏసీ కన్వీనర్ అయిలయ్య, కో కన్వినర్ జి. శ్రీనివాస్ యాదవ్‌లు డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం కురుమ, యాదవ సంఘాలు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించాయి. దీనిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యాదవులు, కురుమలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల రేవంత్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై గొల్ల వృత్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తక్షణమే రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాలు డెడ్‌లైన్ ప్రకటించినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో మహాధర్నా చేపట్టామన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. చలో గాందీభవన్‌తో ఉద్రిక్తత ధర్నా అనంతరం కురుమ, యాదవ సంఘాలు గాందీభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ధర్నా చౌక్ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. -
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలు పురుగుల మందు తాగి బలవ న్మరణానికి పాల్పడిని సంఘటన కరీనంగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కల్వచర్లలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐలయ్య, పర్వత లక్ష్మీ దంపతులు గత కొన్ని రోజులుగా తరచు గొడవపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ షాక్‌తో రైతు మృత్యువాత
పొలంలో విద్యుత్ మోటారు ఆన్ చేయటానికి వెళ్లిన ఓ రైతు షాక్‌తో చనిపోయాడు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం కప్రాయపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గచ్చ ఐలయ్య(35) తన పొలంలో విద్యుత్ మోటారు కోసం ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసేందుకు యత్నించాడు. డోర్ నాబ్‌లో విద్యుత్ ప్రసరించటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఐలయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వడదెబ్బకు గీత కార్మికుని మృతి
కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం బీమ్‌పల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి ఐలయ్య(60) సోమవారం ఉదయం వడదెబ్బకు మృతిచెందాడు. ఐలయ్య గీత కార్మికునిగా పనిచేసేవాడు. సోమవారం ఉదయం కల్లు గీత పనికి వెళ్లి ఎండ వేడిమికి తట్టుకోలేక కుప్పకూలి మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.