కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం బీమ్‌పల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి ఐలయ్య(60) సోమవారం ఉదయం వడదెబ్బకు మృతిచెందాడు.
కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం బీమ్‌పల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి ఐలయ్య(60) సోమవారం ఉదయం వడదెబ్బకు మృతిచెందాడు. ఐలయ్య గీత కార్మికునిగా పనిచేసేవాడు. సోమవారం ఉదయం కల్లు గీత పనికి వెళ్లి ఎండ వేడిమికి తట్టుకోలేక కుప్పకూలి మృతిచెందాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.