కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య సంఘటన కరీనంగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యభర్తలు పురుగుల మందు తాగి బలవ న్మరణానికి పాల్పడిని సంఘటన కరీనంగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం కల్వచర్లలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐలయ్య, పర్వత లక్ష్మీ దంపతులు గత కొన్ని రోజులుగా తరచు గొడవపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.