విశాఖపట్నం: కడదాక తోడుంటానని మాటిచ్చి.. పెళ్లికి ముందే కాపురం పెట్టించిన యువకుడు చివరకు ఆ యువతిని మోసం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి సమీపంలోని ఉక్కుపేటకు చెందిన దర్జి వెంకట లక్ష్మీ(22) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఆమెకు మూడేళ్ల క్రితం స్థానికంగా నివసించే సింహాద్రితో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. రెండేళ్ల నుంచి ఇద్దరు ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఈ దసరాకు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెబుతూ వచ్చిన సింహాద్రి మాటమార్చడంతో లక్ష్మీ అతనిని నిలదీసింది.
దీంతో తనంటే ఇష్టం లేదని సింహాద్రి చెప్పాడు. తాను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని యువతితో అన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండేళ్లు సహజీవనం చేసి..
Published Fri, Oct 7 2016 7:24 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement