పొలంలో విద్యుత్ మోటారు ఆన్ చేయటానికి వెళ్లిన ఓ రైతు షాక్‌తో చనిపోయాడు.
పొలంలో విద్యుత్ మోటారు ఆన్ చేయటానికి వెళ్లిన ఓ రైతు షాక్‌తో చనిపోయాడు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం కప్రాయపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గచ్చ ఐలయ్య(35) తన పొలంలో విద్యుత్ మోటారు కోసం ట్రాన్స్‌ఫార్మర్ ఆన్ చేసేందుకు యత్నించాడు. డోర్ నాబ్‌లో విద్యుత్ ప్రసరించటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఐలయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.