వెంకట్‌రెడ్డి మృతదేహం రోదిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు
మాడుగులపల్లి(మిర్యాలగూడ) : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మాడ్గులపల్లి మండలం తోపుచర్లలో సోమవా రం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ విజ య్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కరసాల వెంకట్‌రెడ్డి (51) రోజూమాదిరిగా సీత్యాతండా శివారులో తనకున్న వ్యవసాయ బావి వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్లివస్తున్నాడు. మార్గమధ్యలో 11 కేవీ విద్యుత్ వైర్లు ఇటీవల కురిసిన వర్షాలకు వైర్లు కిందకు సాగడంతో వెంకట్‌రెడ్డి వాటిని గమనించకపోవడంతో వైర్లు అతడికి మెడకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.
అధికారులు నిర్లక్ష్యంతోనే ..
విదుŠయ్‌త్ వైర్లు కిందికి వెలాడుతున్నాయని నాలుగు రోజుల నుంచి అధికారులకు పలు మార్లు ఫోన్ చేసినా వారు స్పందించ లేదని సమీప రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వెంకట్‌రెడ్డి కూడా శనివారం ఫో న్ చేసి అధికారులకు చెప్పినట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యంతోనే తాము ఇంటి పెద్దదిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మృతదేహాన్ని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, వేములపల్లి వైస్ ఎంపీపీ రావు ఎల్లారెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment