సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అంటే రైతుల కన్నీళ్లు తుడిచేది కాదు.. కన్నీరు పెట్టించేది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, సీఎం రేవంత్.. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి హరీష్ సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు. సీఎం రేవంత్.. హైడ్రా పేరుతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. తెలంగాణలో గూండాగిరి పెరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హత్యాచారాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్ఢర్ లేదు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి.
ఇదే సమయంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై..‘ఇప్పటికైనా ఫిరాయింపులపై కాంగ్రెస్ బదలాయింపులు మానుకోవాలి. అబద్దం చెబితే అతికేటట్టు ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు తెలుసుకోవాలి. ఫిరాయింపులపై మంత్రి శ్రీధర్ బాబు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మర్యాదపూర్వకంగా అయితే సీఎంను కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో కలుస్తారా?. అరికెపూడి గాంధీ సొంత నియోజకవర్గానికి సీఎం వస్తే.. ప్రకాష్ గౌడ్ ఎందుకొచ్చినట్లు?. కాంగ్రెస్ నీతిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు శిక్ష తప్పదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఖమ్మం ప్రజలకు శాపంగా కాంగ్రెస్..
సాగునీరు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. సీఎం రేవంత్ నిర్లక్ష్యం, ముగ్గురు మంత్రుల సమన్వయలోపం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. 22రోజుల నుండి ఆయకట్ట గండి పూడ్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సాగర్ నిండు కుండలా ఉన్నప్పటికీ ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయి. గత ఏడాది ప్రకృతి కరువు వస్తే.. ఈసారి కాంగ్రెస్ కరువు తెచ్చింది. మూడు లక్షల ఎకరాల పంటపై మంత్రులకు శ్రద్ధ లేదు.
ఖమ్మం ప్రజలు తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే అవసరానికి ఒక్క హెలికాప్టర్ రాదు. సాగు నీరు ఇవ్వరు. ఇదేనా ఖమ్మం ప్రజలకు మీరు ఇచ్చే బహుమతి. మంత్రులు తిరిగేందుకు హెలికాప్టర్లు ఉంటాయి కానీ.. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్ ఉండదా?. మిమ్మల్ని గెలిపించడమే ఖమ్మం ప్రజలు చేసిన శాపమా?. వరదల్లో నష్టపోయిన రైతుకు ఎకరాకు 25వేల నష్ట పరిహారం ఇవ్వాలి. నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలి.
ఇది కూడా చదవండి: హైడ్రా కూల్చివేతలు.. యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి!
Comments
Please login to add a commentAdd a comment