
'ప్రాజెక్టుల నిర్మాణంలో విచ్చలవిడిగా అవినీతి'
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు వేలకోట్లు ధారదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను హరీశ్ రావు ప్రారంభించడం దారుణమని నాగం వ్యాఖ్యానించారు. కాగా మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలం రేలంపాడు వద్ద నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం రెండో లిఫ్ట్‌కు హరీష్‌రావు ఇవాళ ప్రారంభోత్సవం చేసిన విషయం తెలిసిందే.