టీఆర్‌ఎస్ ప్రభుత్వం మెక్కిన అవినీతి సొమ్మును కక్కించేవరకు తన పోరాటం ఆపనని..
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం మెక్కిన అవినీతి సొమ్మును కక్కించేవరకు తన పోరాటం ఆపనని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
'టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి పనులను ఆధారాలతో సహా బయటపెడితే.. మంత్రి హరీష్‌రావు దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఏసీ గదిలో కూర్చొని మాట్లాడినా ఆయనకు చెమటలు పడుతున్నాయి. తప్పు చేయకుంటే అంత భయపడాల్సిన అవసరం ఏముంది. టీఆర్‌ఎస్ అవినీతిని బయటపెట్టేవరకు వదిలిపెట్టను' అని నాగం అన్నారు.