
కేసీఆర్ చూపంతా అవినీతిపైనే: నాగం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చూపంతా అవినీతివైపే ఉందని, ఆయన కేంద్రాన్ని సాయం అడగకుండా నిద్రపోతున్నారని బీజేపీ నాయకుడు నాగం జనార్దనరెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చూపంతా అవినీతివైపే ఉందని, ఆయన కేంద్రాన్ని సాయం అడగకుండా నిద్రపోతున్నారని బీజేపీ నాయకుడు నాగం జనార్దనరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్కు సంపాదనే అజెండాగా మారిపోయింది తప్ప ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
పదవి చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఐదు నెలల్లో కనీసం ఒక్క గంట సమయాన్ని కూడా ఆయన రైతుల కోసం కేటాయించలేదని నాగం ఆరోపించారు. కరెంటు సమస్య తీర్చకపోతే తెలంగాణ అసెంబ్లీని తాము ముట్టడిస్తామని హెచ్చరించారు.