అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? | nagam janardan challange to hareesh rao | Sakshi
Sakshi News home page

అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

Published Wed, Sep 21 2016 2:18 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? - Sakshi

అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

మంత్రి హరీశ్‌కు బీజేపీ నేత నాగం సవాల్

 సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో జరుగుతున్న అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మంత్రి హరీశ్‌రావుకు బీజేపీనేత నాగం జనార్దన్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రెస్‌క్లబ్‌లో లేదా మరెక్కడైనా ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు చర్చకు సిద్ధమైతే తాను సంబంధిత ఫైళ్లతో వచ్చి నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట ధన కైంకర్య యజ్ఞం చేస్తున్నారని.. అంతా అవినీతి మయమై పోయిందన్నారు. తెలంగాణలో కాదు కశ్మీర్‌లో తిరంగా జెండా ఎగురవేయాలంటూ హరీశ్‌రావు దేశద్రోహం మాటలు మాట్లాడారన్నారని, దీనిపై దేశ, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement