తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే ప్రాజెక్టులపై విచారణకు సిద్ధపడాలని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే ప్రాజెక్టులపై విచారణకు సిద్ధపడాలని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ అవినీతిని కోర్టులో తేల్చుకుంటా' అని అన్నారు.
సోమవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నా.. కేసీఆర్ నిందించడం సరికాదని నాగం విమర్శించారు.