'కేసీఆర్ అవినీతిని నాగుపామై కాటేస్తా'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని నాగుపామునై కాటేస్తానని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పాలన నడుస్తోందని మండిపడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రాజెక్టులో అవినీతిపై న్యాయపోరాటం చేస్తానని నాగం అన్నారు.