కోర్టుకు వెళ్తే కేసీఆర్‌కు చెమటలు ఎందుకు?
కోర్టుకు వెళ్తే కేసీఆర్‌కు చెమటలు ఎందుకు?
Published Tue, Feb 28 2017 12:35 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
హైదరాబాద్: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ తన వాటా కోసం కేవలం అవినీతి మీదనే దృష్టి సారించారు.. పనులు ఎలా పూర్తి చేయాలి అనే ఆలోచన లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా ప్రయోజన వాజ్యాలు వేస్తే కేసీఆర్‌కు ఎందుకు చెమటలు పడుతున్నాయని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డు కోవడంలేదు.. అర్హత లేని వారికి పనుల కాంట్రాక్టులు ఇచ్చినందుకే కోర్టుకు వెళ్తున్నామని చెప్పారు. అవినీతి మీద పోరాటం కొత్త కాదన్నారు. ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే ప్రతిపక్షాలను కలుపుకున్నారని ఎద్దేవా చేశారు.
కోర్టుకు వెళ్లడం నేరం కాదని, అది తమ రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయలేని వారికి పనులెలా ఇచ్చావు.. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడతావా.. కాళేశ్వరం మీద ఎవరూ పిల్ వెయ్యలేదు.. అనుమతులు ఏమయ్యాయని నిలదీశారు. అవినీతిపై చర్చకు రావాలి లేదా సీఎఎస్‌ను పంపిస్తే సాక్ష్యాధారాలతో రుజువు చేస్తానన్నారు. సన్యాసులు నీలా అవినీతి చెయ్యరంటూ శశికళ, లాలూ వంటి వాళ్లకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందిని అని నాగం హెచ్చరించారు.
Advertisement