టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సంఘం | Nagam comments on TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సంఘం

Published Mon, Jul 4 2016 3:41 AM | Last Updated on Fri, Oct 19 2018 7:27 PM

టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సంఘం - Sakshi

టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సంఘం

ప్రభుత్వ అవినీతి ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులా: నాగం
 
 సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అంటే.. తెలంగాణ రజాకార్ల సంఘం అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిండా అవినీతిలో కూరుకుపోయిందని, దీనిని ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ అవినీతి కార్యకలాపాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు చెందిన పత్రిక, టీవీ చానల్‌పై పరువునష్టం దావా వేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement