
కిరికిరీల ముఖ్యమంత్రిగా కేసీఆర్: నాగం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీల మధ్య, జిల్లాల మధ్య సీఎం కేసీఆర్ పంచాయితీలు పెడుతూ కిరికిరీల ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, తెలంగాణ బచావో మిషన్ వ్యవస్థాపకులు నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చే ర్చుకుంటున్నారని, ఇది అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పారీ ్టలే లేకుం డా చేయాలని టీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టు డిజైన్ మార్పు వల్ల ఎగువన ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. డిజైన్ మార్పును చూస్తూ ఊరుకోబోమని, దీనిని అడ్డుకుంటామన్నారు.