‘మిషన్ కాకతీయ’ హెల్ప్‌లైన్ ప్రారంభించిన మంత్రి హరీష్ | harishrao starts mission kakatiya helpline number | Sakshi
Sakshi News home page

‘మిషన్ కాకతీయ’ హెల్ప్‌లైన్ ప్రారంభించిన మంత్రి హరీష్

Published Thu, Apr 16 2015 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

harishrao starts mission kakatiya helpline number

హైదరాబాద్ సిటీ: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుధ్దరణపై ప్రజల నుంచి నేరుగా సూచనలు, సలహాలు స్వీకరించేందుకు రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఆరంభించింది. గురువారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు హెల్ప్‌లైన్ నెంబర్ 040-23472233ని ఆరంభించారు. ఈ హెల్ప్‌లైన్ నిర్వహణ కోసం ఇద్దరు ఈఈ, డీఈ, జేఈలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, చెరువుల పునరుధ్దరణ పనుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగ స్వాములై పూడికమట్టిని తరలించుకుపోవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement