హైదరాబాద్ : నారాయణ్ఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో హరీశ్రావు మాట్లాడుతూ... మిషన్ కాకతీయ, సంక్షేమ కార్యక్రమాలపై రేపు సభలో చర్చిస్తామన్నారు.
అలాగే కేబినెట్ విస్తరణపై మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే అని ఆయన తెలిపారు. దసరా పండగ తర్వాతే పార్టీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హరీశ్రావు వెల్లడించారు. అలాగే ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు.