సాక్షి,హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్,బీజేపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం(జులై 23) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
‘ఏపీలో వెనుకబడిన జిల్లాలపై కేంద్ర బడ్జెట్‌లో మాట్లాడారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. కిషన్‌రెడ్డి,బండి సంజయ్ ఏం చేస్తున్నారు ? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ లేదు.
తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేసింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా’అని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కనీసం 15 రోజులు జరపాలని కోరితే ప్రభుత్వం దానిని కేవలం 4 రోజులకు కుదించిందని మండిపడ్డారు. తమ హయాంలో బడ్జెట్ సమావేశాలు 9 రోజులు నిర్వహించి డిమాండ్లపైనా చర్చించేవాళ్లమని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment