
సాక్షి, నారాయణఖేడ్: బీఆర్‌ఎస్ ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తే కాంగ్రెస్ వాళ్లకు గుండెలో గుబులు పుడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఖేడ్ రోడ్ షోలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ భూపాల్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. కర్ణాటకలో 9 గంటలు ఉన్న కరెంటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 గంటలకు వచ్చిందని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ వాళ్లు వెళ్లేటపుడు స్వాతంత్రం ఇచ్చిపోయారని, కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే అది బ్రిటీష్ వాళ్ల భిక్షేనన్నారు.
‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా తేల్చుకోండి. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు. కర్ణాటకలో ఖజానా ఖాళీ అయింది. కరెంట్ బంద్ అయ్యింది. కేసీఆర్ వచ్చిన తరువాత తెలంగాణలో కర్ఫ్యూ లేదు. 30 వ తేదీన కాంగ్రెస్ వాళ్ళకు దిమ్మ తిరగాలె. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మారుస్తాం. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉంటే ,ప్రభుత్వ ఆస్పత్రులు మూతపడతాయి. ప్రైవేట్ ఆస్పత్రులు ఓపెన్ అవుతాయి. నారాయణఖేడ్ మున్సిపాలిటీ లో పెరిగిన టాక్స్‌లను తగిస్తాం. బీఆర్‌ఎస్ పవర్‌లోకి వస్తే తెల్లకార్డుపై సన్నబియ్యం ఇస్తాం’ అని హరీశ్‌రావు తెలిపారు.
ఎల్లారెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ..
‘ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అమెరికా నుంచి వచ్చి సంతలో పశువులను కొన్నట్టు నాయకులను కొంటున్నాడు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని ఊదర గొట్టారు. ఇప్పుడు అక్కడ జనాలు లబో దిబో మొత్తుకుంటున్నారు. రెండు మూడు గంటలు మించి అక్కడ కరెంట్ రావటం లేదట. రేవంత్‌రెడ్డి 10 హెచ్‌పీ మోటార్ పెడితే 3 గంటల కరెంట్ చాలంటున్నాడు. 10 హెచ్‌పీ ఆయన తాత కొనిస్తాడ రైతులకు. కాంగ్రెస్ వాళ్లు రైతు బంధు కాపీ కొట్టిండ్రు. ఖర్గే కర్ణాటకలో నీ ఊళ్ళో మంచి నీళ్లు వస్తున్నయా? యువశక్తి కింద ఒక్క రూపాయి ఇస్తున్నవా? కబర్దార్ నోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు’ అని హరీశ్‌రావు హెచ్చరించారు.
ఇదీచదవండి..కొల్లాపూర్‌లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు
Comments
Please login to add a commentAdd a comment