సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది మంది గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటికి మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈ దఫా అత్యధికంగా గెలుపొంది తమ సంఖ్యాబలాన్ని డబుల్ డిజిట్‌కు చేర్చారు. ప్రస్తుతం గెలుపొందిన పది మందిలో ఆరుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించగా.. నలుగురు బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో మహిళల గెలుపు ఆరుకు పరిమితమైంది. తాజాగా వారి సంఖ్య 10కి చేరుకోవడం శుభపరిణామని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం గెలుపొందిన మహిళల్లో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఇద్దరు ఎస్సీ, మరో ఇద్దరు ఎస్టీ, ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు.
Comments
Please login to add a commentAdd a comment