women MLAs
-
ఢిల్లీకి మహిళా సీఎం?
న్యూఢిల్లీ: ఢిల్లీకి మరోసారి మహిళే ముఖ్యమంత్రి కానున్నారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అత్యున్నత వర్గాలను ఉటంకిస్తూ పార్టీ వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. కాబోయే సీఎం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లోంచే ఎంపికవుతారని కూడా తెలుస్తోంది. పార్టీలో పలువురు నేతల అభిప్రాయం కూడా అదే కావడంతో ఈ విషయంలో అధిష్టానం రెండో ఆలోచన చేయకపోవచ్చంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను బీజేపీ ఓడించడం తెలిసిందే. తద్వారా ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ తరఫున నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం పదవికి మహిళనే ఎంచుకుకోవాలని పార్టీ నిర్ణయిస్తే వారిలో ఎవరికి అదృష్టం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేగాక వెనకవబడ్డ వర్గాల నుంచి ఒకరిని ఉప ముఖ్యమంత్రిని కూడా చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మహిళలకు, దళితులు, ఇతర వెనకబడ్డ వర్గాలకు మంత్రివర్గ కూర్పులో కూడా అధిక ప్రాధాన్యం దక్కడం ఖాయమంటున్నారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియపై పార్టీ పెద్దలు ఇప్పటికే దృష్టి పెట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు సమావేశమై దీనిపై చర్చించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన విజయం సాధించిన బీజేపీ నేత పర్వేశ్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ రెండు రోజులుగా వార్తలు వస్తుండటం తెలిసిందే. ఆయన మాజీ సీఎం కుమారుడు. పర్వేశ్ తండ్రి సాహిబ్‌సింగ్ వర్మ బీజేపీ తరఫున ఢిల్లీ సీఎంగా పని చేశారు. పర్వేశ్‌తో పాటు వీరేంద్ర గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, పవన్ వర్మ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్న తరుణంలో తాజాగా అనూహ్యంగా మహిళా సీఎం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ 13న తిరిగి రానున్నారు. సీఎం అభ్యరి్థపై ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. బహు శా 15వ తేదీకల్లా దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు. ఆ నలుగురు వీరే... బీజేపీ నుంచి నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. షాలిమార్‌బాగ్ స్థానం నుంచి రేఖా గుప్తా, నజఫ్‌గఢ్ నుంచి నీలం పెహల్వాన్ 29 వేల పై చిలుకు మెజారిటీతో నెగ్గారు. గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్ 3,188 ఓట్ల మెజారిటీతో ప్రముఖ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్‌పై నెగ్గారు. వాజీపూర్ నుంచి పూనం శర్మ కూడా 11 వేల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటిదాకా ముగ్గురు ఢిల్లీకి ఇప్పటిదాకా ముగ్గురు మహిళలు సీఎంలయ్యారు. వారిలో తొలి వ్యక్తిగా బీజేపీ నేత సుష్మా స్వరాజ్ నిలిచారు. 1998లో ఆమె సీఎం పగ్గాలు చేపట్టారు. అయితే కేవలం 52 రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. ఆమె తర్వాత కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ రూపంలో రెండో మహిళ ఢిల్లీ గద్దెనెక్కారు. ఆమె 2013 దాకా ఏకంగా 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగడం విశేషం. అనంతరం ఆప్ నుంచి తాజాగా ఆతిశీ రూపంలో మూడో మహిళ ఢిల్లీ సీఎం అయ్యారు. ఆమె కేవలం నాలుగున్నర నెలల పాటు పదవిలో కొనసాగారు. -
ఉమెన్.. డబుల్ డిజిట్..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది మంది గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటికి మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈ దఫా అత్యధికంగా గెలుపొంది తమ సంఖ్యాబలాన్ని డబుల్ డిజిట్‌కు చేర్చారు. ప్రస్తుతం గెలుపొందిన పది మందిలో ఆరుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించగా.. నలుగురు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో మహిళల గెలుపు ఆరుకు పరిమితమైంది. తాజాగా వారి సంఖ్య 10కి చేరుకోవడం శుభపరిణామని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం గెలుపొందిన మహిళల్లో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఇద్దరు ఎస్సీ, మరో ఇద్దరు ఎస్టీ, ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. -
సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించి చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు
కోహిమా: 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్‌విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. -
మహిళా ఎం.ఎల్.ఏలు చరిత్ర సృష్టించారు
నాగాలాండ్ ఏర్పడి 60 ఏళ్లు. 60 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఇప్పటి వరకూ ఒక్క మహిళ కూడా అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఆ ఘనతను ఇద్దరు ఎం.ఎల్.ఏలు దక్కించుకొని చరిత్ర సృష్టించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హెకాని జకాలు, సల్‌హౌటనో క్రుసె విజయం సాధించారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగగా డిమాపూర్–3 నుంచి హెకాని, పశ్చిమ అంగమె నుంచి క్రుసె విజయం సాధించారు. అక్కడి పాలనాధికారంలో స్త్రీలప్రాతినిధ్యం మొదలైంది. ఇది ఆగదు. మహిళలను ‘ఆకాశంలో సగం’ అంటాం. వారికి అవకాశాలలో సగం దక్కాలన్న ఉద్యమాలు బయలుదేరి చాలా కాలం అయ్యింది. కాని ఇంకా కొన్నిచోట్ల వారికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. పురుష భావజాలం స్త్రీలలో కూడా నాటుకు పోయి స్త్రీకి స్త్రీయే ప్రతికూలత సృష్టించేవరకూ వెళుతోంది. ఉదాహరణకు నాగాలాండ్‌లో పా లనాధికారంలో స్త్రీలు ఉండటాన్ని మొదటినుంచీ వ్యతిరేకించారు. అక్కడి మొత్తం ఓటర్లు 13 లక్షలు ఉంటే వారిలో దాదాపు ఆరున్నర లక్షల ఓటర్లు మహిళలే అయినా వారు ఒక్క మహిళనూ గెలిపించుకోలేదు. దానికి కారణం అక్కడ ఇంటి పెద్ద, సమూహం పెద్ద, ఊరి పెద్ద ఎవరికి ఓటెయ్యమంటే స్త్రీలు వారికే ఓటు వేయాలి. పురుషులే సంపా దనపరులు కనుక పురుషుల మాట వినాలని స్త్రీలు అనుకుంటారు. పురుషులు సహజంగానే స్త్రీల ్రపా తినిధ్యాన్ని అంగీకరించరు. కనుక 1963లో నాగాలాండ్ ఏర్పడితే... 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేవలం 20 మందికే సీట్లు దక్కాయి. కాని ఎవరూ గెలవలేదు. డిపా జిట్లు కూడా రాలేదు. 2018లో 5 మంది స్త్రీలు పోటీ చేస్తే వారిలో ఎవరూ గెలువలేదు. కాని ఈ ధోరణిలో ఇప్పుడు మార్పు వచ్చిందనే సంకేతాలు అందుతున్నాయి. 2023 ఎన్నికలలో మొత్తం 183 మంది అన్ని పా ర్టీల నుంచి బరిలో దిగగా వీరిలో నలుగురు స్త్రీలు ఉన్నారు. ఈ నలుగురిలో నేషనల్ డెమొక్రటిక్ ప్రో గ్రెసివ్ పా ర్టీ (ఎన్.డి.పి.పి) నుంచి ఇద్దరు మహిళలు హెకాని, క్రుసె గెలిచారు. బి.జె.పితో కలిసి ఎన్.డి.పి.పి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అందువల్ల ఈ ఇరువురిలో ఎవరైనా మంత్రి అయితే అదీ మరో చరిత్ర కాగలదు. ఏడు ఓట్లతో గెలిచిన క్రుసె నాగాలాండ్‌లోని పశ్చిమ అంగమి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ఎన్.డి.పి.పి అభ్యర్థి, 56 సల్‌హౌటనో క్రుసె ఏడంటే ఏడే ఓట్లతో విజయం సాధించింది. పశ్చిమ అంగమెలో ఆమెకు ప్రత్యర్థిగా నిలిచిన నఖ్రో గతంలో నాగా పీపుల్స్ పా ర్టీలో ఉండేవాడు. ఆ తర్వాత ఎన్.డి.పి.పికి జంప్ చేశాడు. కాని ఈ ఎన్నికల్లో ఎన్.డి.పి.పి టికెట్ ఇవ్వక పోయేసరికి ఇండిపెండెంట్‌గా రంగంలో దిగాడు. అతణ్ణి ఓడించడానికి క్రుసె సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి వచ్చింది. హోటల్స్ రంగంలో ఉన్న క్రుసె నాగాలాండ్‌లోని సామాజిక సంస్థలకు కలిసి పని చేస్తోంది. తన గిరిజన తెగ మహిళా విభాగానికి నాయకురాలిగా కూడా ఉంది. ఈమె గెలుపుతో అంగమిలో భారీ వేడుకలు మొదలయ్యాయి. జనం బారులు తీరి అభినందనలు తెలుపుతున్నారు. మొదటి విజేత హెకాని నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం జరిగిన ఫలితాల లెక్కింపులో ఆ రాష్ట్రంలో గెలిచిన మొదటి మహిళా ఎం.ఎల్.ఏగా ఎన్.డి.పి.పి అభ్యర్థి హెకాని జకాలు (47) మొదట డిక్లేర్ అయ్యింది. ఆ తర్వాతే రెండో మహిళా అభ్యర్థి క్రుసె గెలుపు ప్రకటితమైంది. అందువల్ల హెకాని విజయం విశేషంగా మారింది. డిమాపూర్–3 నియోజకవర్గంలో సిట్టింగ్ ఎం.ఎల్.ఏ జిమోమిని 1536 ఓట్లతో ఓడించింది హెకాని. అయితే ఈమెకు ఈ గెలుపు ఊరికే రాలేదు. సుదీర్ఘ కృషి ఉంది. డిమాపూర్లో పుట్టి పెరిగిన హెకాని ఢిల్లీలో చదువుకుంది. ఆ తర్వాత అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో లా చదివింది. నాగాలాండ్‌లో ‘యూత్‌నెట్ నాగాలాండ్’ అనే ఎన్.జి.ఓను స్థాపించి యువతీ యువకుల చదువుకు,ఉపా ధికి మార్గం చూపింది. ‘మేడ్ ఇన్ నాగాలాండ్’ పేరుతో వస్తు ఉత్పత్తి, ఆవిష్కరణల కోసం కోహిమాలో ఒక సెంటర్ నడుపుతోందామె. అందుకే ఆమెకు నారీశక్తి పురస్కారం లభించింది. ఈ ఎన్నికలలో ఆమె తన విజయం కోసం గట్టిగా పోరాడింది. స్త్రీల విద్య, ఉపా ధికి హామీలు ఇచ్చింది. ఆమె కోసం అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ ప్రచారం చేశాడు. -
యూపీ ఉభయసభల్లో ఒక్క రోజు మహిళలకే!
లక్నో: ఉత్తరప్రదేశ్ ఉభయ సభల్లో గురువారం కేవలం మహిళా ప్రజాప్రతినిధులు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. బీజేపీకి చెందిన అనుపమ జైస్వాల్ సభకు అధ్యక్షత వహించారు. మహిళా ప్రతినిధుల ప్రసంగాలను అసెంబ్లీ గ్యాలరీలో నుంచి మహిళా వైద్యులు, విద్యార్థినులు, బాలికలు ప్రత్యక్షంగా వీక్షించారు. ముందుగా సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్‌ల ప్రసంగించారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా మహిళా ఎమ్మెల్యేలు సూచనలు అందజేయాలని సీఎం యోగి కోరారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయాలని అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి సూచించారు. యూపీ అసెంబ్లీలోని 403 మంది సభ్యులకు గాను 47 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. 100 మందితో కూడిన శాసనమండలిలో ఆరుగురు ఎమ్మెల్సీలున్నారు. -
కొత్త అసెంబ్లీల్లో పెరిగిన మహిళా ప్రాతినిథ్యం
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల ప్రాతినిథ్యం పెరిగింది. గత అసెంబ్లీలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య పెరిగిందని పీఆర్ఎస్ రిసెర్చ్ సంస్థ తెలిపింది. 2017లో యూపీ అసెంబ్లీలో 42 మంది మహిళా ఎంఎల్ఏలు ఉండగా ప్రస్తుతం వీరి సంఖ్య 47కు పెరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య 5 నుంచి 8కి, మణిపూర్‌లో 4 నుంచి 8కి పెరిగింది. ఎంఎల్ఏలుగా ఎన్నికైన వారిలో 55 సంవత్సరాలు నిండినవారి సంఖ్య పెరిగింది. మరోవైపు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో వయసులో పెద్దవారైన ఎంఎల్ఏల సంఖ్య పెరిగింది. 55 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఎంఎల్ఏల సరాసరి 2017లో 64.7 శాతం ఉండగా, 2022కు 59.5 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. కనీసం డిగ్రీ అర్హత ఉన్న ఎంఎల్ఏల వాటా యూపీలో 72.7 నుంచి 75.9 శాతానికి పెరగ్గా, ఉత్తరాఖండ్‌లో 77 నుంచి 68 శాతానికి, మణిపూర్‌లో 76 నుంచి 68 శాతానికి తగ్గిందని సంస్థ వెల్లడించింది. -
సీఎం జగన్ వల్లే మహిళా సాధికారత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సాధికారత సీఎం జగన్ వల్లే సాధ్యమవుతోందని పలువురు మహిళా ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రతి అడుగులోనూ సీఎం వైఎస్ జగన్ మహిళలకు ఓ అన్నలా అండగా నిలబడుతున్నారని కొనియాడారు. గురువారం అసెంబ్లీలో ‘మహిళా సాధికారత’ అంశంపై జరిగిన చర్చలో మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడారు. చంద్రబాబు మహిళలను నమ్మించి మోసం చేస్తే.. సీఎం జగన్ అడుగడుగునా అండగా నిలబడ్డారన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో పొయ్యి వెలిగిందంటే సీఎం వైఎస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. సామాజిక స్వాతంత్య్రం దిశగా.. మహిళల సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్య్రం సాధ్యమని సీఎం వైఎస్ జగన్ నమ్మారు. ఈ దిశగానే వివిధ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తున్న మనసున్న మహారాజు ఆయన. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ సొంతంగా మహిళల ఎదుగుదల కోసం.. మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తామే నిలబడి ఎదగాలని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి మహిళ సీఎం జగన్ తమకు అన్నలా అండగా ఉన్నారన్న ధైర్యంతో ఉన్నారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఒకేసారి 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రాష్ట్రంలో ఇళ్లు లేని పేద కుటుంబాల్లో 30 లక్షల మంది మహిళలకు వారి పేరుతోనే ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత సీఎం జగన్ సొంతం. ఆయన మహిళల్లో కొత్త ఆత్మస్థైర్యాన్ని నింపారు. అనేక ఒడిదుడుకులు, కరోనా కష్టాల మధ్య కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, విశ్వాసరాయ కళావతి ఓ వెల్లువలా మహిళా సాధికారత గత రెండున్నరేళ్లుగా మహిళా సాధికారత కోసం ఓ వెల్లువలా, విప్లవంలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అందరికీ ఓ అన్నలా సీఎం వైఎస్ జగన్ నిలబడ్డారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధ ప్రభుత్వం ఇంకా మంచి చేయాలి మహిళల అభివృద్ధికి టీడీపీ ఎంతో కృషి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేస్తోంది. అవి మహిళలకు అందుతున్నాయి. ఈ ప్రభుత్వం ఇంకా మంచి బాగా చేయాలి. మద్యపాన నిషేదాన్ని పూర్తిగా చేయాలి. – టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చంద్రబాబు మహిళలకు శఠగోపం పెట్టారు.. 2014 అసెంబ్లీ ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మహిళలకు ఎలా శఠగోపం పెట్టాడో చూశాం. మహిళలకు ఆకాశమంత అండగా సీఎం వైఎస్ జగన్ ఉంటున్నారు. ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులకు చంద్రబాబు ఆటంకాలు సృష్టించాలని చూస్తే అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బెల్టుషాపులను తొలగించారు.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే 43 వేల బెల్ట్‌షాపులను తొలగించారు. అక్రమ మద్యం అమ్మకాలను నిర్మూలించడానికి సచివాలయాల్లో ప్రత్యేకంగా మహిళా సంరక్షణాధికారులను నియమించారు. –వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కె.శ్రీదేవి మాటల్లో కాకుండా చేతల్లో చూపిన నాయకుడు.. మహిళల అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న నాయకుడు.. వైఎస్ జగన్. తమకు దేవుడి ఇచ్చిన అన్న జగన్ అని ప్రతి మహిళ చెబుతోంది. కరోనా సంక్షోభ సమయంలో పేదల ఇళ్లల్లో పొయ్యి వెలిగిందంటే దానికి కారణం ఆయనే. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇళ్లను టీడీపీ అడ్డుకుంది వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మద్యం అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. పేదల ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను నిర్మిస్తుంటే టీడీపీ అడ్డుకుంది. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దివంగత మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో దివంగతులైన మాజీ శాసనసభ్యులకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ తీర్మానాన్ని చదివారు. మాజీ ఎమ్మెల్యేలు ఎం.అబ్దుల్ అజీజ్, ఎ.రామిరెడ్డి, పి.కృష్ణమూర్తి, పి.రంగనాయకులు, వంకా శ్రీనివాసరావు, డాక్టర్ టి.వెంకయ్య, డి.పేరయ్య, పిన్నెల్లి లక్ష్మారెడ్డి, ఎంవీ రమణారెడ్డి, డాక్టర్ ఎస్.పిచ్చిరెడ్డిల మృతికి శాసనసభ సంతాపం ప్రకటిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపు శాసనసభ మౌనం పాటించి దివంగతులకు నివాళులర్పించింది. బద్వేలు ఎమ్మెల్యేగా దాసరి సుధ ప్రమాణ స్వీకారం సాక్షి, అమరావతి: ‘నాడు మెడిసన్ పరీక్షలు రాసేందుకు పరీక్ష హాల్లోకి వెళ్లే సమయంలో భయపడ్డాను.. మళ్లీ నేడు రాష్ట్ర అసెంబ్లీలోకి అడుగుపెడుతూ అదే విధంగా భయపడ్డాను. ఎమ్మెల్యే అవుతానని అసెంబ్లీకి వస్తానని నేను కలలో కూడా ఊహించలేదు..’ అంటూ కొత్తగా ఎన్నికైన వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఉద్వేగంతో చెప్పారు. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన దాసరి సుధ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆమెతో ప్రమాణం చేయించారు. మహిళా సాధికారతపై చర్చలో పాల్గొన్న అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాట్లాడే అవకాశం రావటం గొప్ప విషయం’ అని ఎమ్మెల్యే సుధ చెప్పారు. -
అసభ్య పోస్టింగులపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజాతోపాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు, పార్టీ మహిళా కార్యకర్తలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ మహిళా నేతలు కోరారు. ఈ మేరకు వారు అదనపు డీజీపీ రవిశంకర్‌ను కలసి గురువారం ఫిర్యాదు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళా నేతలపై అభ్యంతరకరమైన దూషణలతో కూడిన పోస్టింగ్‌లు పెట్టడం అవమానకరమని పేర్కొన్నారు. ఈ పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి శిక్షించాలని కోరారు. దీనిపై అదనపు డీజీపీ స్పందిస్తూ.. నిందితులు ఎంతటివారైనా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల మహిళా విభాగం సమన్వయకర్త పిళ్లం గోళ్ల శ్రీలక్ష్మి, ఏపీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, జమ్మలమడక నాగమణి, బొట్టా కనకదుర్గ, సుధారాణి, హిమబిందు, అనిత, శ్రీలక్ష్మీ, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ఎమ్మెల్యేలు
-
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్లో వైఎస్ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019 (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్)ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడాలంటే హడలెత్తేలా కొత్త చట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ‘ఏపీ దిశ’ చట్టాన్ని రూపొందించారు. సీఎం సమక్షంలో కేక్ కట్ చేసిన బాలినేని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు సచివాలయంలోని సీఎం చాంబర్లో జరిగాయి. సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎన్నికల్లో తగ్గుతున్న మహిళా విజేతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 678 సీట్లకుగాను కేవలం 62 సీట్లలో మాత్రమే మహిళలు విజయం సాధించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో 9.30 కోట్ల మంది మహిళలు ఉండగా, వారిలో కేవలం 9 శాతం మంది మాత్రమే మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యారు. 2013–2014 సంవత్సరంలో ఈ రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 77 ఉండగా, అంటే 11 శాతం ఉండేదని భారత ఎన్నికల కమిషన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రితంసారి కన్నా ఎక్కువ మందే పోటీ చేసినప్పటికీ తక్కువ మంది గెలవడం గమనార్హం. ఒక్క చత్తీస్‌గఢ్‌లో మాత్రమే గతం కన్నా ఈసారి ఎక్కువ మంది విజయం సాధించారు. మిజోరంలో పది లక్షలకుపైగా కలిగిన జనాభాలో 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం శూన్యం. ప్రజాస్వామ్యంలో మహిళల ప్రాతినిధ్యం అంటే ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయడం కాదని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఓ ఎంపీగా గెలవడమని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రితికా కుమార్ వ్యాఖ్యానించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు చురుగ్గా పాల్గొని ఎన్నికవడమే కాకుండా మళ్లీ పోటీచేసి కూడా విజయం సాధిస్తున్నారని ఆన్నారు. వరుసగా గత మూడు ఎన్నికల నుంచి ఈ ఐదు రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువ మందే పోటీ చేస్తున్నప్పటికీ వారు ఎక్కువగా గెలవలేక పోతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 2,716 మంది అభ్యర్థులకుగాను 235 మంది మహిళలు పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 108 మంది, 2008 ఎన్నికల్లో 226 మంది మహిళలు పోటీ చేశారు. ఫలితాల్లో మాత్రం వెనకబడుతున్నారు. 2008లో 25 మంది, 2013లో 30 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మహిళలు మాత్రమే విజయం సాధించారు. ఇక రాజస్థాన్‌లో 2008లో 154 మంది, 2013లో 152 మంది పోటీ చేయగా ఈసారి ఏకంగా 182 మంది పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 25 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మాత్రమే విజయం సాధించారు. పోటీ చేస్తున్న వారి సంఖ్యలో గెలుస్తున్న వారి సంఖ్యను తీసుకుంటే మగవారికన్నా మహిళలే ఎక్కువ విజయం సాధిస్తున్నారు. రాజస్థాన్‌లో మొత్తం పోటీ చేసిన వారి సంఖ్యలో మహిళల శాతం ఎనిమిది ఉండగా, విజయం సాధించిన వారిలో వారి శాతం 11.5 శాతం ఉండడమే అందుకు ఉదాహరణ. నేషనల్ ఎలక్షన్ వాచ్ అధ్యయనం ప్రకారం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈసారి 12 శాతం సీట్లను మహిళలకు ఇచ్చారు. అన్ని పార్టీలకన్నా అతి తక్కువగా తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ 3 శాతం సీట్లనే మహిళలకు ఇచ్చింది. ఇక ఓ మహిళ అధ్యక్షులుగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ 9 శాతం టిక్కెట్లను మహిళలకు ఇచ్చింది. వివిధ పార్టీల తరఫున పోటీ చేసిన మహిళల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది విజయం సాధించారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు చర్చకు వస్తున్న సందర్భంగా ఇలాంటి వివరాలు అవసరమని రితికా కుమార్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
‘ఆమె’ స్థానం అంతంతే !
సాక్షి, కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మహిళా శాసనసభ్యుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటివరకు ముగ్గురు మహిళలకు మాత్రమే అసెంబ్లీలో తమ వాణి వినిపించే అవకాశం దక్కింది. తాజాగా నాలుగో మహిళగా ఇల్లెందు నుంచి ఎన్నికైన బాణోత్ హరిప్రియ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుత శాసనసభలో ఉమ్మడి జిల్లా నుంచి ఆమె ఒక్కరే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 1972లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున దుగ్గినేని వెంకట్రావమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం కాలంలో వివిధ పార్టీల నుంచి చాలా స్వల్ప సంఖ్యలో మహిళా అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఎన్నిక కాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత 2009లో ఒకేసారి ఇద్దరు మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. వైరా నియోజకవర్గంగా ఆవిర్భవించిన తొలిసారే సీపీఐ తరఫున బాణోత్ చంద్రావతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన సత్యవతి గెలుపొందారు. సీపీఎంకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చరిష్మాతో కుంజా సత్యవతి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మహిళలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన మహిళా అభ్యర్థుల సంఖ్య కొంత పెరిగినప్పటికీ.. ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బాణోత్ హరిప్రియ ఒక్కరే విజయం సాధించారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, అందులో ముగ్గురు గిరిజనులే కావడం విశేషం. వీరిలో సత్యవతి ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ కాగా, చంద్రావతి, హరిప్రియ బంజారా తెగకు చెందిన వారు. ఎనిమిది మందిలో ఒకరికే చాన్స్.. ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ప్రధాన పార్టీల తరఫున ఎనిమిదిమంది మహిళలు బరి లో నిలిచారు. వీరిలో ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ఒక్క హరి ప్రియ మాత్రమే గెలుపొందారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం నుంచి బత్తుల హైమావతి, వైరా నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి(సీపీఐ) అభ్యర్థిగా బాణోత్ విజయాబాయి, బీజేపీ అభ్యర్థిగా రేష్మారాథోడ్, ఇల్లెందు నుంచి బీజేపీ అభ్యర్థిగా మోకాళ్ల నాగస్రవంతి, భద్రాచలం బీజేపీ అభ్యర్థిగా కుంజా సత్యవతి, ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉప్పల శారద, సత్తుపల్లి నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా మాచర్ల భారతి పోటీ పడినప్పటికీ.. వారు విజయం సాధించలేకపోయారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం. టీఆర్ఎస్ నుంచి మహిళలే లేరు.. అధికార టీఆర్ఎస్ నాలుగు నియోజకవర్గాల నుంచి సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించడంతో పాటు భద్రాచలం స్థానాన్ని సైతం తెల్లం వెంకట్రావుకు కేటాయించింది. దీంతో ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. పినపాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు సతీమణి పాయం ప్రమీల పేరు వినిపించినప్పటికీ, చివరకు వెంకటేశ్వర్లునే టికెట్ వరించింది. గతంలో ఇలా.. గతంలో జరిగిన వివిధ ఎన్నికల్లో పాలేరు నుంచి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కొత్తగూడెం నుంచి అయాచితం నాగవాణి, భద్రాచలం నుంచి కొమురం ఫణీశ్వరమ్మ టీడీపీ తరఫున పోటీచేసినప్పటికీ ఓటమి చెందారు. అలాగే ఇల్లెందు నుంచి టీడీపీ తరఫున కల్పనాబాయి ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన బాణోత్ హరిప్రియ సైతం గెలుపు ముంగిట వరకు వచ్చి ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె విజయం సాధించారు. భద్రాచలం నుంచి 2009లో సత్యవతి గెలుపొందగా, ఆ ఎన్నికల్లో ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం నుంచి పోటీ చేసిన మరో నలుగురు మహిళా అభ్యర్థులు ఓటమి చెందారు. -
పేరుకే మహిళలు.. పెత్తనమంతా మగాళ్లదే!
కోచి: అనేక ఏళ్లు కమ్యూనిస్టులే పాలించినప్పటికీ కేరళ రాష్ట్ర అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం బాగా తక్కువ. 1957లో రాష్ట్ర అసెంబ్లీలో 114 సీట్లు ఉండగా, ఆరుగురు మహిళలు గెలిచారు. ప్రస్తుతం 140 సీట్లుగల అసెంబ్లీకి ఏడుగురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక సంఘాల్లో ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నికైన మహిళల సంఖ్య 54 శాతం ఉంది. అయినా ఏం లాభం పెత్తనమంతా మగవాళ్లదే. రాష్ట్రం మొత్తం మీద స్థానిక స్వయం పాలక సంఘాలు లేదా సంస్థలు 1200 ఉన్నాయి. వాటిలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయితీలు, 87 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికైన మహిళా సర్పంచులను సంప్రతించగా, పేరుకే తాము సర్పంచులమని, పెత్తనమంతా తమ భర్తలది లేదా పాలకపక్ష నాయకులదేనని మెజారిటీ సభ్యులు చెప్పారు. రిజర్వేషన్ల కారణంగా ఎక్కువ మంది మహిళలు పదవుల్లోకి వస్తున్నారని, అయితే వారికి సరైన రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. మహిళలకు రిజర్వ్ చేయడం వల్లనే తాను మేయర్‌గా ఎన్నికయ్యానని లేకపోతే ఎన్నికయ్యే అవకాశమే లేదని కోచి మేయర్ సౌమిని జైన్ తెలిపారు. తనకు విధులు నిర్వహించడమంటే ప్రతిరోజు గడ్డు రోజేనని ఆమె చెప్పారు. కేరళ రాజకీయాల్లో మొదటి నుంచి మగవాళ్ల ప్రాబల్యమే ఎక్కువని ప్రముఖ ఆర్థిక వేత్త ఎంఏ ఊమ్మెన్ చెప్పారు. రాజకీయాల్లో మహిళల ప్రాబల్యం పెరగాలంటే పార్టీలకు అతీతంగా పదవుల్లో ఉన్న మహిళలంతా ఏకం కావాలని ఆయన సూచించారు. -
వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యం
-
వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యం
► అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్త వాతావరణం ► పోడియం, చానల్స్ లోగోలను లాక్కున్న పీతల సుజాత, అనిత ► టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం సాక్షి, అమరావతి: అసెంబ్లీ మీడియా పాయిం ట్లో టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యానికి దిగారు. మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళా ఎమ్మెల్యేల నుంచి చానళ్ల లోగోలను లాక్కున్నారు. వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగానే మంత్రి పీతల సుజాత వారి నుంచి లోగోలు లాక్కుని మాట్లడడానికి ప్రయత్నించారు. టీడీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి వచ్చి వారిని గెంటివేసి లోగోలు లాక్కునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు వారిని ప్రతిఘ టించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక దశలో టీడీపీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈశ్వరి వర్సెస్ అనిత: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో మీడియా పాయింట్లో మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సహచర ఎమ్మెల్యేలతో కలసి బయలుదేరారు. టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, సౌమ్య, మీసాల గీత వారికన్నా ముందుగా మీడియా పాయింట్‌కు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేశారు. చాలాసేపు వేచిచూసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పుష్పశ్రీవాణి, పి.రాజేశ్వరీ, కళావతి ఆ ఆరోపణలను ఖండించేందుకు ప్రయత్నిం చారు. సీఎం చంద్రబాబు తల నరకాలని తాను అన్నట్టు టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆరోపిస్తున్నారని, తాను అన్నట్టు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని గిడ్డి ఈశ్వరి సవాల్ చేశారు. దీంతో ఈ అంశంపై అనిత, ఈశ్వరి మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం మంత్రి పీతల సుజాత, టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఈశ్వరి నుంచి చానల్స్‌కు చెందిన లోగోలను తమ వైపునకు లాక్కుని ప్రసంగించడం ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, అప్పలనాయుడు సైతం మీడియా పోడియంను తమవైపునకు లాక్కున్నారు. పోడియంకు ఒకవైపున వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మరోవైపున టీడీపీ ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించడంతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్ధితి నెలకొంది. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, సునీల్‌కుమార్ తదితరులు మీడియా పాయింట్‌కు చేరుకుని తమ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తీసుకువెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
రికార్డు స్థాయిలో మహిళా ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యూపీ ఎన్నికల్లో ఈసారి అత్యధికంగా మహిళలు గెలుపొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది సరికొత్త రికార్డుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్ చేశారు. కాగా మీడియా కథనాలు ప్రకారం 38మంది మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 43మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించగా, వారిలో 32మంది విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నుంచి చెరో ఇద్దరు, సమాజ్‌వాదీ, అప్నా దళ్ పార్టీల నుంచి ఒకొక్కరు గెలుపొందారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 నియోజకవర్గాలు ఉండగా...గెలుపొందిన మహిళల శాతం వీరి గెలుపు శాతం (9.2) పది కంటే తక్కువగా ఉంది. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూపీలో పెద్ద మొత్తంలో మహిళలు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. Glad that a new record has been set of highest women MLAs elected in UP Assembly. Congratulations to all women MLAs. https://t.co/o6s2dh7eD4 — Narendra Modi (@narendramodi) 13 March 2017 -
ప్రతిపక్షంలో పడతులు సున్నా!
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళలు ఎన్నికయ్యారు. 140 స్థానాలున్న కేరళ శాసనసభలో కేవలం 8 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరంతా ఎల్డీఎఫ్ కు చెందినవారే కావడం విశేషం. అధికారం కోల్పోయిన యూడీఎఫ్ లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా పోవడం గమనార్హం. ఊమెన్ చాంది ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఏకైక మహిళా ఎమ్మెల్యే పీకే జయలక్ష్మి ఓడిపోయారు. మే 16న జరిగిన తాజా ఎన్నికల్లో 109 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సీపీఎం నుంచి ఐషా పొట్టి, కేకే శైలజ, మెర్కికుట్టి అమ్మ, వీణా జార్జి, యు ప్రతిభ హరి గెలుపొందారు. సీపీఐ నుంచి ఈఎస్ బీజీ మోల్, గీతా గోపి, సీకే ఆశ విజయం సాధించారు. గత అసెంబ్లీలో అధికార పక్షం నుంచి ఒకరు, విపక్షం నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. -
రాజకీయ సమీకరణాల వల్లే..
సాక్షి, హైదరాబాద్: ‘ఈ ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకమ’న్న కాంగ్రెస్ సభ్యుడు రంగారెడ్డి ఆరోపణపై శుక్రవారం శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. సభలోనే ఉన్న ఐటీ, పంచాయతీరాజ్‌శాఖా మంత్రి కె.తారక రామారావు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ‘మహిళలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేని మాట వాస్తవమే. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల కేబినెట్లోకి తీసుకోకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన మహిళలపై గౌరవం లేదని సభ్యుడు ఆరోపించడం తగదు’ అని వ్యాఖ్యానించారు. అయినా డిప్యూటీ స్పీకర్, పార్లమెంటరీ సెక్రటరీ వంటి పదవులు ఇచ్చామన్నారు. అలాగే నాలుగు జిల్లాలకు మహిళా కలెక్టర్లను నియమించిన ఘనత తమదేనన్నారు. మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అంగన్వాడీలకు రూ. 4,600 నుంచి రూ. 7 వేల వరకు వేతనాలు పెంచామన్నారు. 2 లక్షల మంది బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నామన్నారు. మహిళలపై గౌరవం లేదని అనడం వల్లే ఇవన్నీ మాట్లాడాల్సి వస్తోందని... తానేమీ ముందుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కేటీఆర్ వివరించారు. ఇలా పరస్పర వాదనలతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. దీనిపై ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ స్పందిస్తూ... ఇలా పరస్పర ఆరోపణలు చేసుకోవడం తగదన్నారు. ‘మీ ఒత్తిడులు మీకుండొచ్చు. అందువల్ల మహిళలను క్యాబినెట్లోకి తీసుకోకపోయి ఉండొచ్చు. అయినా అది మీ ఇష్టం. మహిళలకు వ్యతిరేకం అని మా సభ్యుడు అన్న విషయాన్ని రికార్డుల్లోంచి తీసేస్తే నాకేమీ అభ్యంతరం లేద’ని డీఎస్ విజ్ఞప్తి చేశారు. అలాగే వాటర్‌గ్రిడ్ పథకం వాటర్ పైపుల కాంట్రాక్టర్ల కోసమేనన్న విమర్శలపైనా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. వాటర్‌గ్రిడ్‌పై అనుమానం ఉంటే రెండు గంటలపాటు చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ‘రక్షిత తాగునీరు హక్కు’గా తేవాలనేది తమ ఉద్దేశమన్నారు. అది గుజరాత్‌లోనూ విజయవంతమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ సురక్షిత మంచినీరు ఇచ్చివుంటే నల్లగొండలో ఫ్లోరోసిస్ ఉండేదా అని నిలదీశారు. కాంగ్రెస్ సభ్యుడు రంగారెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులను పక్కన పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఈ ప్రాజెక్టు చేపడితే వాటర్‌గ్రిడ్ కంటే పెద్దది అవుతుందని రంగారెడ్డి అన్నారు. బోగస్ ఇళ్లు, అక్రమాలు తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగాయని తేలితే చార్మినార్ వద్ద ఉరి తీయండని కోరారు. టీఆర్ఎస్ సభ్యుడినా అనిపించింది... అంకెలు ఘనంగా ఉన్నాయి... కానీ ప్రాధాన్యాలు సరిగ్గా లేవని టీడీపీ సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినప్పుడు నాకు నేను ‘నేను కూడా టీఆర్ఎస్ సభ్యుడినా అన్న ఫీలింగ్ కలిగింది’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కంగుతిన్నారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు కచ్చితంగా కనీస మద్దతు ధర అందేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి పోట్ల అనేక విమర్శలు చేయగా... ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు లేకుండా పోయిందన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగే పరిస్థితి లేదన్నారు. ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు సాధారణ కానిస్టేబుల్, హోంగార్డ్ వంటి చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండటం ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి నిలువెత్తు ఉదాహరణగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 163 ఇంజనీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు రద్దు చేశామన్నారు. మరో 125 కళాశాలల పూర్తి సమాచారాన్ని తీసుకున్నామన్నారు. మొత్తం 288 ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితిని ఆన్లైన్లో పెడతామని కడియం పేర్కొన్నారు. ‘మీకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. కాబట్టి మేనేజ్మెంట్ల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడొద్దని’ టీడీపీ సభ్యుడు పోట్లకు కడియం శ్రీహరి సూచించారు. దీంతో పోట్ల మనస్తాపానికి గురై తన కాలేజీని మూయించాలని అనుకుంటున్నారని... ఇక దీనిపై తాను మాట్లాడనని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి, జెడ్పీ చైర్మన్లకు వేతనాలు పెంచడం రాజకీయ నిర్ణయమని పోట్ల విమర్శించగా... తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. సభలో మంత్రి జోగు రామన్న కూడా మాట్లాడారు. సభ్యులు కర్నె ప్రభాకర్ బడ్జెట్‌పై ప్రసంగం ప్రారంభించారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపునకు సంబంధించి ప్రకటన చేశారు. ఎవరికి ఎంతెంత పెరిగింది వివరాలు వెల్లడించారు. -
టీ కేబినెట్లో మహిళలకేదీ ప్రాతినిధ్యం?
పాలమూరుకు రెండో విడతే గిరిజనులకు దక్కని అవకాశం ఖమ్మంకు లేనట్టే! హైదరాబాద్: ముఖ్యమంత్రితో కలిపి 12 మందితో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కలేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు కూడా ఈ కేబినెట్లో ప్రాతినిధ్యం లభించలేదు. అలాగే ఖమ్మం జిల్లాకు ప్రస్తుతానికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు లేవు. టీఆర్ఎస్కు ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలున్నారు. వీరిలో కనీసం ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయని భావించారు. అయితే తొలి కేబినెట్లో మహిళలెవరికీ చోటు దక్కలేదు. దీంతో పదవులు ఆశించిన మహిళానేతలు నిరాశకు గురయ్యారు. పాలమూరు ఎక్కడ? మహబూబ్‌నగర్ జిల్లాకు తొలి కేబినెట్లో అవకాశం రాలేదు. ఈ జిల్లా నుంచి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, పార్టీకి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి, ఉద్యమం సందర్భంగా మొదట రాజీనామా చేసిన చెరుకు లక్ష్మారెడ్డిలో ఒకరికి అవకాశం వస్తుందని భావించారు. అయితే మంత్రివర్గంలో ఇప్పటికే కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ ముగ్గురూ ఒకే సామాజికవర్గం(వెలమ) నుంచి ఉండటం వల్ల అదే సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకు దీనిలో అవకాశం రాలేదు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మారెడ్డి ఉద్యమంకోసం అందరికంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీకి జిల్లా అధ్యక్షునిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్నారు. ఈయనకు మొదటి విడతలోనే పదవి వస్తుందని అనుకున్నా సామాజికవర్గ సమతూకం కోసం రెండో విడతకు వాయిదా పడినట్టు టీఆర్ఎస్లోని ముఖ్యులు చెబుతున్నారు. అయితే వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు. అయితే స్వామిగౌడ్‌ను మంత్రిని చేస్తానని కేసీఆర్ గతంలో బహిరంగంగానే హామీ ఇచ్చారు. ఇప్పటికే పద్మారావు అదే సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లో ఒకరికి మాత్రమే అవకాశం రావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంకు నో చాన్స్! ఖమ్మం జిల్లాకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాల్లేవు. ఈ జిల్లా నుంచి టీఆర్ఎస్కు ఒకే ఎమ్మెల్యే సీటు ఉంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జలగం వెంకట్రావు కూడా వెలమ సామాజికవర్గానికే చెందినవారు కావడం వల్ల ఈ జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. విప్ వంటి పదవులకు కూడా పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఆ అవకాశం కూడా దక్కకపోవచ్చని తెలుస్తోంది. అలాగే కేబినెట్లో ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ సామాజికవర్గంలో సీనియరుగా ఉన్న అజ్మీరా చందూలాల్‌కు అవకాశం వస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా మంత్రివర్గంలో ఆయన పేరు కనిపించలేదు. విస్తరణలో అవకాశం: కవిత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మహిళలకు అవకాశం లభిస్తుందని ఎంపీ కవిత చెప్పారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మొదటి కేబినెట్లో మహిళలు లేకపోవడంపై ఏమంటున్నారని విలేకరులు అడగ్గా.. మొదటిరోజే ప్రశ్నలతోనే ఇబ్బంది పెడితే ఎలా అని నవ్వుతూ అంటూనే విస్తరణలో అవకాశం ఉంటుందని భావిస్తున్నానన్నారు. కేబినెట్లో మొత్తం 18 మంది వరకు తీసుకునే అవకాశం ఉంది కదా అని పేర్కొన్నారు. ఇంతకుముందు ముట్టడి కోసం సచివాలయానికి వచ్చిన టీఆర్ఎస్కు ఇప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతం దక్కడం తమ అదృష్టమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు.