పీకే జయలక్ష్మి
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళలు ఎన్నికయ్యారు. 140 స్థానాలున్న కేరళ శాసనసభలో కేవలం 8 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరంతా ఎల్డీఎఫ్ కు చెందినవారే కావడం విశేషం. అధికారం కోల్పోయిన యూడీఎఫ్ లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా పోవడం గమనార్హం. ఊమెన్ చాంది ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఏకైక మహిళా ఎమ్మెల్యే పీకే జయలక్ష్మి ఓడిపోయారు.
మే 16న జరిగిన తాజా ఎన్నికల్లో 109 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సీపీఎం నుంచి ఐషా పొట్టి, కేకే శైలజ, మెర్కికుట్టి అమ్మ, వీణా జార్జి, యు ప్రతిభ హరి గెలుపొందారు. సీపీఐ నుంచి ఈఎస్ బీజీ మోల్, గీతా గోపి, సీకే ఆశ విజయం సాధించారు. గత అసెంబ్లీలో అధికార పక్షం నుంచి ఒకరు, విపక్షం నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.