సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నారని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మొదటిరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహర శైలిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘సభ సజావుగా సాగేందుకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ సభ్యులు వినలేదు. చర్చకంటే రచ్చకే కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రైతులు ఆనందంగా ఉంటే కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.
రైతు సమస్యలపై చర్చించే సత్తా వారికి లేదు. అందుకు రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు. సభ సజావుగా జరుగుతుంటే కాంగ్రెస్ సభ్యులు ఎందుకు పోడియంలోకి వచ్చి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే సభలో మిగతా ఏ పార్టీలు కూడా కాంగ్రెస్‌ను పట్టించుకోలేదు. దీంతో ఆ పార్టీ ఏకాకిగా మారిపోయింది. ఏ అంశం మీదైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే సభలో గందరగోళం సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment